మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. త్వరలోనే నితిన్ సినిమాతో నేరుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. అలానే 'శ్రీదేవి బంగ్లా' అనే సినిమాతో బాలీవుడ్ కి వెళుతోంది.

మరోపక్క 'విష్ణుప్రియ' అనే సినిమాతో కన్నడలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాకి ఓ ప్రశ్న ఎదురైంది. 'కన్నడ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టేశారు. సూపర్‌స్టార్ యశ్‌తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా?' అని ఓ విలేకరి అడిగారు.

దీనికి సమాధానంగా.. ''ఈ ప్రశ్నకు ఇంతకుముందు కూడా సమాధానమిచ్చాను. నేను ఎవ్వరి పేర్లు బయటికి చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే కేవలం ఫలానా హీరోతో మాత్రమే సినిమా చేయాలని ఉందని చెబితే నా చేతిలో ఉన్న మిగతా సినిమాలు పోతాయి. నేను అందరితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అందరూ తనను వింక్ గర్ల్ అని పిలుస్తున్నారని.. అలా పిలవొద్దని.. తన ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేయడానికి తన కళ్లే కీలక పాత్ర పోషిస్తాయని.. కన్ను కొట్టడంతో పాటు ఈ సినిమాలో విభిన్నంగా నటించడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది.