Asianet News TeluguAsianet News Telugu

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు, రచయిత కన్నుమూత!

ప్రముఖ మలయాళ నటుడు, సినీ రచయిత పి. బాలచంద్రన్ తుదిశ్వాస విడిచారు. 69ఏళ్ల బాలచంద్రన్, గత ఎనిమిది నెలలుగా అనాగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా ఆసుపత్రికే పరిమితమై చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. 

malayala actor and writer p bala chandran passes away ksr
Author
Hyderabad, First Published Apr 5, 2021, 12:42 PM IST

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, సినీ రచయిత పి. బాలచంద్రన్ తుదిశ్వాస విడిచారు. 69ఏళ్ల బాలచంద్రన్, గత ఎనిమిది నెలలుగా అనాగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా ఆసుపత్రికే పరిమితమై చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. 


1991లో మోహన్‌లాల్ హీరోగా నటించిన అంకుల్ బన్ అనే సినిమాతో బాలచంద్రన్ స్క్రీన్ రైటర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు.ఆ చిత్రం ద్వారా వచ్చిన గుర్తింపుతో పలు మలయాళ సినిమాలకు స్క్రీన్ రైటర్ గా, స్టోరీ అండ్ డైలాగ్ రైటర్ గా పనిచేశారు.కళా  రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా కేరళ ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించింది. 1989లో ఆయన నటించిన పావన్ ఉస్మాన్ నాటకానికి గానూ, ఆయన ఈ అవార్డు అందుకోవడం జరిగింది. 


బాలచంద్రన్ కి భార్య శ్రీలత, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలచంద్రన్‌ నటుడు కాకముందు మహాత్మ గాంధీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆ తర్వాత థియేరిటికల్ ఆర్ట్స్‌, నటనలో శిక్షణ తీసుకున్నారు. బాలచంద్రన్ మరణ వార్త తెలుసుకున్న మలయాళ చిత్ర ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios