నెల టిక్కేట్టు సినిమాతో వెండితెరకు పరిచయమైన హాట్ బ్యూటీ మాళవిక శర్మ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సడన్ గా ఈ ఫొటోలతో షాక్ ఇచ్చింది. చూస్తుంటే అమ్మడికి గ్లామర్ డోస్ తో పాటు డేర్ డోస్ కూడా గట్టిగానే ఉందని అర్ధమవుతోంది. పులిని చూస్తేనే కొంత మంది అమ్మాయిలు గజగజ వణికిపోతారు. 

కానీ ఈ వనిత మాత్రం ప్రేమతో ఇష్టంగా పులితో ఫొటోలకు ఫోజిచ్చింది.  బ్యాంకాక్ లోని పట్టాయా బీచ్ కి ఇటీవల వెళ్లిన అమ్మడు సమీపంలోని టైగర్ పార్క్ కి వెళ్లింది. అక్కడి పులులు మనుషులతో చాలా సన్నిహితంగా ఉండేలా పెంచారు. అయితే మాళవిక వాటిని చూసి ఏ మాత్రం భయపడకుండా దగ్గరికెళ్లింది. ప్రస్తుతం ఆమె పులితో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇక నెల టిక్కెట్టు ప్లాప్ అవ్వడంతో మరో సినిమా చేయని ఈ బ్యూటీ మంచి కథల కోసం ఎదురుచూస్తోంది.