త్వరలో ప్రభాస్.. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభాస్ కొత్త చిత్రాలకు సైన్ చేయడం మాత్రం ఆపడం లేదు. తాజాగా ప్రభాస్ మరో చిత్రానికి సైన్ చేశాడు. 

త్వరలో ప్రభాస్.. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సో మారుతి చిత్రానికి ప్రభాస్ కొద్దిగా మాత్రమే కాల్ షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మారుతి కూడా త్వరగా ఈ చిత్రాన్ని ఫినిష్ చేస్తానని హామీ ఇచ్చాడట. 

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో ముగ్గులు హీరోయిన్లు ఉండబోతున్నట్లు టాక్. ఒక హీరోయిన్ గా తమిళ స్టన్నింగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. మాళవిక మోహనన్ తన అందచందాలతో సోషల్ మీడియాలో ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

బికినీ ఫోటోలు, హాట్ ఎక్స్పోజింగ్ డ్రెస్ లలో మాళవిక నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఆమె హాట్ హాట్ అందాలకు సౌత్ ఆడియన్స్ మొత్తం ఫిదా అవుతున్నారు. తెలుగులో తొలి ఛాన్స్ కోసం మాళవిక ఎదుచూస్తోంది. ఎట్టకేలకు ఆమె అదిరిపోయే ఆఫర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 

ప్రభాస్ సినిమాలో నటించడం అంటే గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లే. ప్రభాస్ సినిమాలో నటిస్తే చాలు హీరోయిన్లకు కూడా పాన్ ఇండియా క్రేజ్ వచ్చేస్తుంది. త్వరలోనే మాళవిక మోహనన్ ఎంపికని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు టాక్.