Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ మంచి ఫ్యామిలీ కం లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తుంది. మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంది. ఇక ఈ రోజు మార్చి 6 వ ఎపిసోడ్ లో  ఏం జరుగుతుందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో ఎంత రిజిస్టర్ మ్యారేజ్ అయితే మాత్రం మరి ఇంత సింపుల్ గానా అంటాడు. అయితే అటు చూడండి అంటాడు. బ్యాండ్ మేళం అక్కడ రెడీగా ఉంటారు. అందరూ డాన్సులు చేసుకుంటూ ఆనందంగా రిజిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తారు యష్ వాళ్ళు. అక్కడ పనిచేసే వ్యక్తి దగ్గరికి వెళ్లి చిత్ర, వసంత్ ల పేర్లు చెప్తారు.

అతను ఆ పేపర్స్ చూస్తూ ఉండగా విన్నీ కూడా మంచి సంబంధం చూడు కదా పెళ్లి చేసేద్దాం అంటాడు యష్. అప్పుడే నాకు బిల్డ్ ఏంటి అంటాడు విన్నీ. ఆ మాటలకి అందరూ నవ్వుకుంటారు. మరోవైపు సులోచన డాక్యుమెంట్లు చూస్తున్న ఆ వ్యక్తిని చూసి అగ్రహారం వాడే అని తెలుసుకొని మాటల్లో పెడుతుంది. అతను కూడా చనువుగా మాట్లాడుతూ అల్లుడిది కూడా అగ్రహారం ఏనా అంటాడు.

కాదు మలబార్ వాళ్ళు అంటే మన అగ్రహారంలో అబ్బాయిలు లేరా అంటాడు అతను. ఎందుకు ఆలస్యం అవుతుంది ఏమైనా అబ్జెక్షన్సా అంటాడు యష్. పెట్టాము కానీ ఎవరూ లేగులుగా అబ్జెక్షన్ పెట్టలేదు ఈ పేపర్స్ తీసుకొని రిజిస్టర్ దగ్గరికి వెళ్తాను ఆయన రమ్మనగానే మిమ్మల్ని పిలుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు సిద్ధాంతి గారితో మాట్లాడుతూ ఉంటుంది భ్రమరాంబిక అప్పుడే అక్కడికి వచ్చిన మాళవిక వాళ్ళని చూపిస్తూ ఇద్దరి జాతకాలు జాగ్రత్తగా చూశారు కదా వాళ్లు కూడా వచ్చారు ఇప్పుడు చెప్పండి అంటుంది బ్రమరాంబిక. వీరిద్దరిది చూడ ముచ్చటైన జంట ఒకరి కోసం ఒకడు పుట్టారు అన్నట్లుగా కలిసిపోయాయి వీళ్ళ జాతకాలు అంటారు సిద్ధాంతి గారు. అన్ని అంత బాగుంటే ఎన్నాళ్ళు ఒకవేళ పెళ్లి ఎందుకు డిలే అయింది అంటుంది బ్రమరాంబిక.

పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదు అది అసలు అంటారు సిద్ధాంతి గారు. దీనికి పరిష్కారం లేదా అంటాడు అభి. పరిష్కారం ఉంది కానీ మీరు ఒప్పుకోవాలి కదా అంటాడు సిద్ధాంతి. నేను అభిమన్యు భార్య కావటానికి ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాను అంటుంది మాళవిక. అయితే ముందు మీరు ఈ ఇల్లు వదిలి వెళ్లిపోండి వివాహానికి ముందు కాబోయే భార్య భర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండకూడదు, మాళవిక గారు పెళ్లయ్యేంతవరకు ఈ ఇంటికి దూరంగా ఉండాలి అంటారు సిద్ధాంతి గారు.

నేను ఒప్పుకోను అంటాడు అభి. నేను ఒప్పుకుంటున్నాను అంటుంది మాళవిక. ఒకసారి ఆలోచించు మనం పెళ్లి చేసుకోవాలని ఆరేళ్ల నుంచి అనుకుంటూనే ఉన్న కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక లాగా వాయిదా పడుతూ వస్తుంది. నీతో పెళ్లి కావాలి అప్పుడే సొసైటీలో తలెత్తుకోగలం. కొంతమంది నాకు ముందు తలదించుకునేలాగా చేస్తాను అంటుంది మాళవిక. మీరు వెళ్ళటానికి సిద్ధపడిన మిమ్మల్ని ఈ ఇంటి నుంచి శాస్త్రవేత్తంగా తీసుకు వెళ్ళటానికి పుట్టింటి వారు రావాలి ఉన్నారా అని అడుగుతారు సిద్ధాంతి గారు.

వదులుకొని ఇక్కడికి వచ్చింది అంటుంది భ్రమరాంబిక. నాకు రక్తసంబంధీకులు ఉన్నారు అంటూ అభి కి భ్రమరాంబికకి షాక్ ఇస్తుంది మాళవిక. మరోవైపు కుటుంబ సభ్యులందరూ కలిసి రిజిస్టర్ దగ్గరికి వెళతారు. అక్కడ రిజిస్టార్ ఎలాంటి లీగల్ సబ్జెక్షన్లు లేదని తెలుసుకొని ముందు మీరు సంతకాలు పెట్టండి తరువాత సాక్షులు సంతకాలు పెడతారు ఫైనల్ గా నేను సంతకం పెడతాను. అప్పుడు పెళ్లయిపోయినట్లే అంటాడు. మా సాంప్రదాయం ప్రకారం దండాలు మార్చుకోవచ్చా అని సులోచన అడుగుతుంది.

మార్చుకోవచ్చు అంటారు రిజిస్టార్. శర్మ గారు చిత్ర కి వసంత్ కి దండలు ఇవ్వటంతో వాళ్లు మార్చుకోవటానికి రెడీ అవుతుండగా ఒక వ్యక్తి వచ్చి అబ్జెక్షన్ చెప్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరగబోయే పెళ్లి న్యాయపరంగా జరగాలి, రిజిస్టర్ నోటీసులో ఫిర్యాదు పెట్టాలి, ఎలాంటి లీగల్ అధ్యక్షుడు ఉండకూడదు కానీ ఈ పెళ్లికి లేత అబ్జెక్షన్ ఉంది అంటూ డాక్యుమెంట్స్ చూపిస్తాడు ఆ వ్యక్తి.

ఆ డాక్యుమెంట్ చూసిన రిజిస్టర్ ఈ పెళ్లి జరిపించలేను అని చెప్తాడు. ఈ పెళ్లికి లీగల్ అబ్జెక్షన్ పెట్టింది ఎవరు అంటూ ఆ వచ్చిన వ్యక్తిని అడుగుతాడు యష్. వెనకనుంచి నేనే అన్న మాళవిక ని చూసి అందరూ మరింత షాక్ అవుతారు. అందరూ ఆమె దగ్గరికి వెళతారు. ఆపడానికి అడ్డుపడటానికి నువ్వు ఎవరు నా చెల్లెలు పెళ్లి ఆపితే చూస్తూ ఊరుకుంటానా అంటుంది వేద. ఈ పనికిమాలిన ప్రశ్నలు అన్ని ఇక్కడ కాదు అక్కడ అడుగు అంటూ యష్ ని చూపిస్తుంది. నీ భర్త దగ్గర సమాధానం తీసుకొని చేతనైతే ఈ పెళ్లి చేయు.

ఎలా చేస్తావో నేను చూస్తాను అప్పటివరకు ఇక్కడే ఉంటాను. నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో, ఏం చేసినా సరే నీ చెల్లి పెళ్లి చేసుకో నేను చూస్తాను అంటూ ఛాలెంజ్ చేస్తుంది. నేను ఇంత మాట్లాడుతున్న మౌనంగా నిలబడ్డాడే నీ భర్త, అతన్ని నోరు విప్పడం లేదు ఏంటి అని అడుగు, నా ముందు తలదించుకున్నాడు ఎందుకు అని అడుగు. ఈ పెళ్లి జరగకుండా ఆపాను కదా ఆ కారణం చెప్పమను అంటుంది మాళవిక. ఆవేశంగా మాళవిక దగ్గరికి వెళ్ళబోతున్న వసంత్ ని ఆపుతాడు యష్.

ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉంటుంది వేద. మాళవిక అక్కడినుంచి వెళ్ళి పోవటంతో భర్త వైపు ప్రశ్నార్ధకంగా చూస్తుంది వేద. అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జరిగిందేంటి నాకు అర్థం కావట్లేదు, మాళవిక వచ్చి పెళ్లి ఆపడం ఏంటి నాకు అంత అయోమయంగా ఉంది అని బాధపడతారు శర్మ దంపతులు. నాకు వసంత్ పద్ధతి నచ్చలేదు అయినా ఆ మాళవికి ఏం హక్కు ఉందని ఈ మ్యారేజ్ ని అబ్జెక్ట్ చేస్తుంది. తను మాట్లాడాలి కదా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఊరుకున్నాడేంటి, పాపం చిత్ర ఎంత అప్సెట్ అయిందో.

వచ్చిన వెంటనే రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది ఇప్పటివరకు రాలేదు అని బాధపడుతుంది సుహాసిని. చిత్ర పరిస్థితి ఊహించుకుంటేనే తట్టుకోలేకపోతున్నాను ఇంత ఎదురు దెబ్బ తగిలాక దాని గుండె పగిలిపోయి ఉంటుంది. చేసుకుంటుందో అని భయంగా ఉంది అంటుంది సులోచన. నువ్వు వెళ్లి చూడు తనని నువ్వే ఓదార్చగలవు అంటాడు శర్మ.

తరువాయి భాగంలో ఒంటరిగా ఉన్న యష్ దగ్గరికి వచ్చి తను ఈ పెళ్ళికి ఆపడం ఏంటి అసలు ఈ పెళ్లికి ఏంటి సంబంధం అని నిలదీస్తుంది వేద. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను అంటాడు యష్. నేను చెప్తాను అంటూ అక్కడికి వచ్చిన వసంత్ నేను చెప్పుకోవడానికి సిగ్గుపడే మాళవిక నాకు అక్క అనే భయంకరమైన నిజాన్ని చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది వేద.