ఈ సాంగ్ లిరికల్ వీడియోలో...ఓ చోట..అని నాన్న అన్నా అంటూ వస్తుంది.అప్పుడు రవితేజ ఫేస్ ప్లాష్ అవుతుంది. ఇది చూసిన వాళ్లు సోషల్ మీడియాలో ఫన్ చేస్తున్నారు. 


ప్రమోషన్ వీడియోలు బయిటకు రిలీజ్ చేసేటప్పుడు దర్శక,నిర్మాతలు మాగ్జిమం జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతూంటాయి. సోషల్ మీడియా జనం కళ్ల పడుతాయి. అక్కడ నుంచి ట్రోలింగ్ మొదలు అవుతుంది. ఇప్పుడు అదే రవితేజ తాజా చిత్రం ప్రమోషన్ సాంగ్ వీడియోకు జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగింది అంటే..

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా మూడో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వాట్స్ హ్యాపెనింగ్ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. 

ఈ సాంగ్ లిరికల్ వీడియోలో...ఓ చోట..అని నాన్న అన్నా అంటూ వస్తుంది.అప్పుడు రవితేజ ఫేస్ ప్లాష్ అవుతుంది. ఇది చూసిన వాళ్లు సోషల్ మీడియాలో ఫన్ చేస్తున్నారు. శ్రీ లీల వయస్సు అమ్మాయికు తండ్రి వయస్సు రవితేజది అంటూ ట్రోల్ చేస్తున్నారు. రవితేజకు,శ్రీ లీలకు ఉన్న ఏజ్ గ్యాప్ ని ప్రస్దావిస్తున్నారు. మీరూ వీడియోని ఓ లుక్కేయండి..
 
రమ్య బెహరా, భార్గవలి పిళ్ళై పాడిన ఈ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రచించారు. ఇక ఇందులో రవితేజ అల్ట్రా స్టైల్ లుక్ లో కనిపించి మెప్పించాడు. రవితేజ ప్రేమలో పడిన శ్రీ లీల తనజీవితంలో జరిగిన మార్పుల్ని ఏకరువు పెడుతున్నట్లు లిరిక్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి క్రాక్ తరువాత అంతటి విజయాన్ని అందుకొని మాస్ మహారాజా ఈ సినిమాతోనైనా హిట్ కొడతారంటున్నారు. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, కమర్షియల్ సబ్జెక్ట్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.  

 చాలా కాలం తర్వాత రవితేజ మార్క్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ధమాకా. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.