అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మేజర్. ఈమూవీ రిలీజ్ విషయంలో సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైమ్ సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు టీమ్ ఇంతకీ ఏంచేయబోతున్నారు.
అడవి శేష్ లీడ్ రోల్ లో నటిస్తూ.. ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతోన్న మూవీ మేజర్. ఈమూవీ కరోనా వల్ల రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ సినిమాను ఫైనల్ గా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు టీమ్. ఇక రిలీజ్ కు ముందే స్పెషల్ స్క్రీనింగ్ పేరుతో .. సరికొత్త ప్రయోగానికి తెరలేపారు టీమ్.
మేజర సినిమా రిలీజ్ కు ఇంకా టైమ్ ఉండగా... అంతకంటే ముందే ఈ సినిమాను ప్రీ రిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఫిల్మ్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి రిలీజ్ నుచూడబోతున్నారు ఆడియన్స్. ఇక మేజర్ సినిమాను దేశవ్యాప్తంగా 9నగరాల్లో ప్రదర్శించబోతున్నారు. రేపు (24 మే) నుంచి ఈ నగరాల్లోని ఒక మాల్ లో ఈసినిమా ప్రదర్శించబడుతుంది.
మేజర్ సినిమాను ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్, కొచ్చి, లక్నౌవ్, జైపూర్, అహ్మదాబాద్, ముంబయ్, పూణే, నగరాలలో రేపటి నుంచి స్పెషల్ స్కీనింగ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు టీమ్. ఈ విధంగా అడివి శేష్ స్పెషల్ లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంతే కాదు ఈ నగరాలకు సంబంధించిన స్పెషల్ మ్యాప్ కూడా రిలీజ్ చేశారు టీమ్. ఇక టికెట్స్ ను బుగ్ మై షోలో బుక్ చేసుకోవాలని మూవీ టీమ్ ప్రకటించారు.
మేజర్ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా ఈ మూవీ ప్రోమో కూసి మూవీ టీమ్ ను అభినందించారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు.
