మేజర్ మూవీ దూసుకుపోతోంది. ఒక యుద్థవీరుడి యదార్ధ గాధను అద్భుతంగా తీర్చిదిద్దారంటూ.. అడివిశేష్ అండ్ టీమ్ పై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ సీఏం యోగీఆదిత్యనాథ్ మేజర్ మూవీ చూసి భావోద్వేగానికి గురయ్యారు. 

ఒక యుద్థవీరుడి యదార్ధ గాధను అద్భుతంగా తీర్చిదిద్దారంటూ.. అడివిశేష్ అండ్ టీమ్ పై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ సీఏం యోగీఆదిత్యనాథ్ మేజర్ మూవీ చూసి భావోద్వేగానికి గురయ్యారు. 

అడివి శేష్ తాజా చిత్రం మేజర్ ఘన విజయం సాధించింది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడులు, ఉగ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అందరి ప్రశంసలను అందుకుంటోంది.

తాజాగా మేజర్ చిత్ర యూనిట్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకుంది. టీమ్ సభ్యులతో పాటు ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. యోగి కోసం వీరు ప్రత్యేక షో వేశారు. సినిమాను చూస్తూ యోగి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం అందరినీ యోగి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాను చాలా బాగా తెరకెక్కించారని ప్రశంసించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఉన్నికృష్ణన్ వారసత్వాన్ని యూపీ యువతలోకి తీసుకెళ్తామని చెప్పారు.

ఇండియా అంతటా ఉత్కంఠతో ఎదురు చూసిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ మేజ‌ర్ మూవీ.. సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజ‌ర్ సందీప్ ఉన్ని క్రిష్ణ‌న్ నిజమైన నివాళిగా ఈసినిమా నిలిచిందన్న అభిప్రాయం వ్యాక్తం అవుతోంది. టాలీవుడ్ హీరో అడివి శేష్ టైటిల్ రోల్ పోషించాడు. శ‌‌శి కిరణ్ టిక్కా డైరెక్ట్ చేసిన ఈసినిమా లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. 

ఇక రిలీజ్ కు ముందు మేజర్ టీమ్ కేంద్ర ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కూడా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. మేజ‌ర్‌ సినిమా ట్రైల‌ర్‌ను రాజ్‌నాథ్ వీక్షించారు. ఇండియా గ్రేట్ హీరో క‌థ‌ను తెర‌కెక్కిస్తున్న డైరెక్ట‌ర్ శశిక‌ర‌ణ్, అడివి శేష్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక సినిమా రిలీజ్ తరువాత మెగాస్టార్ చిరంజీవి తదితరులు ఈసినిమా చూసి టీమ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అడివి శేష్ టీమ్ ను అభినందించారు.