అడివి శేష్ (Adivi Sesh) హీరోగా, సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘మేజర్’. ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఓటీటీలోనూ మేజర్ కు ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తుండటం విశేషం.
బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ ‘మేజర్’ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. 2008 ముంబయి దాడుల్లో కీలకపాత్ర పోషించి, అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ద్వారా సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేషు, హీరోయిన్ సాయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) జంటగా నటించారు. దర్శకుడు శశి కిరణ్ తిక్క అద్భుతమైన ఫ్రేమింగ్ తో తన మార్క్ చూపించాడు. రెండేండ్ల కింద షూటింగ్ ప్రారంభమై ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన Major ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
అయితే అటు థియేటర్లలో నే కాకుండా ఇటు ఓటీటీలోనూ అదరగొడుతోందీ చిత్రం. తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఈ నెల 3 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ అయిన సరిగ్గా నెలరోజులకు ఓటీటీలో అడుగుపెట్టిన మేజర్ మూవీ ఇక్కడా సత్తా చాటుతోంది. తాజా అప్డేట్ ప్రకారం.. ఈ మూవీ ఇండియన్ సినిమాల్లో టాప్ 1 మరియు 2 స్థానంలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు ప్రేక్షకులకు ఓటీటీలోనూ మూవీని ఆదరిస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇదే విషయాన్ని తాజాగా హీరో అడివి శేష్ కూడా ట్వీటర్ ద్వారా పేర్కొన్నాడు. రెండు భాషల్లోనూ మేజరకు మంచి రెస్పాన్స్ వస్తోందని ఆయన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని విడుదల తేదీ కంటే ముందే అభిమానుల కోసం దేశంలోని ప్రధాన తొమ్మిది నగరాల్లో ప్రీ ప్రీమియర్ షోలు వేసి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దేశభక్తికి సంబంధించిన చిత్రం కావడంతో ప్రేక్షకులకు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ మూవీలో దర్శకుడు శశికిరణ్ తిక్క ఇంట్రెస్టింగ్ బ్లాక్స్ తో అదరగొట్టాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మూవీలో అడివి శేషు, సాయీ మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలను పోషించారు. సోనీ పిక్చర్స్ మరియు సూపర్ స్టార్ మహేశ్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, అలాగే ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
