టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) తాజాగా నటించిన చిత్రం ‘మేజర్’. ఈ మూవీ థియేట్రికల్ రన్ ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. అయితే హిందీలో తాజాగా మేజర్ సాలిడ్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ హీరోగా నటించిన చిత్రం ‘మేజర్’. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైన సంచలన విజయం సాధించింది. మేజర్ పాత్రలో అడివి శేష్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. అడివి శేష్‌కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా మేజర్ నిలిచింది.
జూన్ 3న రిలీజ్ అయిన ఈ చిత్రం 12 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. Major మూవీ థర్డ్ వీక్ కూడా విజయవంతంగా థియేటర్లలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కలెక్షన్స్ ను చేస్తోంది. 12వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.30.05 కోట్ల షేర్ (రూ.56.60) వసూళ్లు చేసింది. ఒక తెలంగాణలోనే తెలంగాణ మరియు ఏపీలో మేజర్ 12వ రోజు రూ.17.02 కోట్లు (రూ.28.35 కోట్లు) వసూళ్లు చేసింది. హిందీ మరియు తదితర భాషల్లో రూ. 5.10 కోట్లు వసూళ్లు చేసింది.
అయితే బాలీవుడ్ లో మాత్రం మేజర్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. సినిమా రిలీజ్ కు ముందే ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. హిందీలో మాత్రం ‘మేజర్’కు ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. 16 రోజు హిందీలో ఈ చిత్రం రూ. 10 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా హిందీ బెల్ట్ లో ఇప్పటి వరకు రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటింది. ఇలా మంచి వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం ఇంకా తన హవాను కొనసాగిస్తోంది.
బయోగ్రాఫీకల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైనమెంట్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాల కీలక పాత్రల్లో నటించారు.
