అక్కినేని నాగచైతన్య మజిలీ సినిమా ద్వారా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సమంతతో కలిసి నటించిన ఎమోషనల్ లవ్ స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూస్తుండగానే సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. 28రోజుల్లో 68కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. 

నాగచైతన్య కెరీర్ లోనే అత్యధికంగా 38 కోట్ల(షేర్స్) రూపాయలను మజిలీ కలెక్ట్ చేసింది. గత నెల 5న విడుదలైన మజిలీ ఈ రేంజ్ లో హిట్టవుతుందని ఎవరు ఉహించంలేదు. పైగా పోటీగా చిత్రలహరి - జెర్సీ అలాగే కాంచన - అవెంజర్స్ లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కలెక్షన్స్ లో తేడా రాలేదు. 

28రోజులకుగాను ఏరియాల వారీగా మజిలీ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. 

నైజం...................... ..13.02 Cr

సీడెడ్........................ 4.48 Cr

ఉత్తరాంధ్ర................  4.52 Cr

ఈస్ట్........................... 1.82 Cr

వెస్ట్............................ 1.38 Cr

కృష్ణ:.......................... 1.85 Cr

గుంటూరు..................  2.08 Cr

నెల్లూరు.....................: 0.92 cr 

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ .4.40 Cr

ఓవర్సీస్: రూ .4.05 Cr

వరల్డ్ వైడ్ షేర్స్: 38.52 Cr