అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో వసూలవుతున్నాయి. రెండో వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరుగులు తీస్తూనే ఉన్నది. 'మజిలీ' సినిమా హక్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదహారు కోట్లకు విక్రయించారు. ఇప్పటికీ ఏపీ, తెలంగాణాలలో పాతిక కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. రెండు వారాలు పూర్తికాకముందే లాభాల దిశగా దూసుకుపోతుంది. 

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 
నైజాం.................................. రూ.11.08 కోట్లు 
సీడెడ్...................................రూ.3.82 కోట్లు
ఉత్తరాంధ్ర............................రూ.3.70 కోట్లు 
తూర్పుగోదావరి.................... రూ.1.52 కోట్లు 
పశ్చిమ గోదావరి.....................రూ.1.15 కోట్లు 
కృష్ణా.....................................రూ.1.66 కోట్లు 
గుంటూరు..............................రూ.1.90 కోట్లు 
నెల్లూరు................................రూ.0.75 కోట్లు 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించిన షేర్.. రూ.25.58 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ది ఇండియా..............రూ.3.65 కోట్లు 

ఓవర్సీస్.................................. రూ.3.70 కోట్లు 

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేసిన షేర్ రూ.33.50 కోట్లు