సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని యువ జంట మరోసారి తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు. కెరీర్ లో మొదటి సారి పెళ్లి తరువాత సమంత - నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం మజిలీ. ఆ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది 

ఇక మొత్తంగా కెరీర్ లో వీరిద్దరూ కలిసి నటిస్తోన్న నాలుగవ చిత్రం ఇది. కొత్తగా పెళ్ళైన ఓ జంటకు ఎదురయ్యే ఇబ్బందులు చిన్న చిన్న చేదు అనుభవాల మధ్య వారి ప్రయాణం ఎలా సాగింది అనే నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ట్యాగ్ లైన్ గా దేర్ ఈజ్ ఏ లవ్ - దేర్ ఈజ్ ఏ పెయిన్ అనే లైన్ సినిమాలో 'ఎమోషన్ లవ్ కాన్సెప్ట్ ఉన్నట్లు గుర్తు చేస్తోంది. 

ఇక విశాఖపట్నం బ్యాక్ గ్రౌండ్ లో సినిమా కథ నడవనుంది. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ గా చైతు సమంత జోడి తెగ ఆకర్షిస్తోంది. మజిలీ సినిమాకు నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో మజిలీ ప్రేక్షకుల ముందుకు రానుంది.