అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత పెళ్లి త‌ర్వాత  క‌లిసి న‌టిస్తున్న చిత్రం మజిలీ. ఈ సినిమాకి నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైత‌న్య‌, స‌మంత భార్య‌భ‌ర్త‌లుగా న‌టిస్తుండ‌టం విశేషం. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్.   ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ సినిమా కు మంచి హైప్ తీసుకోచ్చాయి. అయితే తాజాగా ఈచిత్రం నుండి సంగీత దర్శకుడు గోపి సుందర్ తప్పుకున్నట్లు టాక్ వస్తుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి గోపి సుందర్‌ తప్పుకున్నాడని చెప్తున్నారు. దాంతో తమన్‌తో బ్యాక్‌ గ్రౌం‍డ్ స్కోర్‌ చేయించే ఆలోచనలో ఉన్నారట మజిలీ టీం.  అయితే  గోపి సుందర్ తప్పుకోవడానికి అసలు కారణాలు తెలియాల్సి వుంది. అయితే ఈ వార్తలపై అధికారికంగా సమాచారం లేదు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఈ వైవిధ్య‌మైన క‌థా చిత్రం చైత‌న్య - స‌మంత జంట‌కు ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.