2024 ఫిబ్రవరి 8 న ‘యాత్ర’ కి సీక్వెల్‌గా రూపొందిన ‘యాత్ర 2’ ని విడుదల చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్.
వైఎస్ జగన్ జీవిత కథతోని కొన్ని ఎపిసోడ్స్ తో రూపొందిన పొలిటికల్ సినిమానే 'యాత్ర 2'. జీవా ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ నటించారు . ఈ సినిమాకు వివాదాలు ఎక్కువ. కలెక్షన్స్ తక్కువ అన్నట్లు పరిస్దితి ఉంది. మొదటి రోజు నుంచి ఎంత పుష్ చేసినా ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు. 'యాత్ర 2' మూవీకి 6 రోజుల్లో ఎంత రాబట్టిందో చూస్తే ఎంత లాస్ అర్దమవుతుంది.
రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.దాంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 10 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే 'యాత్ర 2' మూవీకి మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ అనుకున్న దానికంటే తక్కువగానే వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్‌లో కూడా ఇది క్రమంగా డౌన్ అయింది. వీక్ డేస్‌లో అయితే దారుణంగా ఉంది. ఫైనల్ గా ఈ సినిమాకు ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రూ. 2.80 కోట్లు షేర్, రూ. 5.40 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. నాన్ థియేటర్ రైట్స్ అమ్ముడైతే సమస్య లేదు. కానీ ఇవి ఇప్పుడు దాకా అమ్ముడు కాలేదని తెలుస్తోంది. అంటే ఇప్పుడున్న పరిస్దితిని పట్టి 40 కోట్లు దాకా లాస్ వస్తున్నట్లు తేలింది.
ఇక దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర అంశాన్ని తీసుకుని ‘యాత్ర’ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. 2019 ఫిబ్రవరి 8 న అంటే సరిగ్గా 5 ఏళ్ళ క్రితం ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కటం.. క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకోవటంతో కలిసి వచ్చింది. ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ అందించింది. 5 ఏళ్ళ తర్వాత సరిగ్గా అదే రోజు అంటే 2024 ఫిబ్రవరి 8 న ‘యాత్ర’ కి సీక్వెల్‌గా రూపొందిన ‘యాత్ర 2’ ని విడుదల చేసినా ఫలితం లేదు.
