ఇప్పుడు ఎక్కడ చూసినా, డిసెంబర్‌ 31 సెలబ్రేషన్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ మూడ్‌ కనిపిస్తుంది. బుధవారం నుంచే సెలబ్రిటీ, టాలీవుడ్‌, బాలీవుడ్‌ స్టార్స్ న్యూ ఇయర్‌ మూడ్‌లోకి వెళ్లిపోయారు. చాలా వరకు గోవాకి చెక్కేస్తున్నారు. అక్కడ ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు తమకి నచ్చిన ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ మహేష్‌ మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నారు. 

ఆయన తమ పిల్లలతోనే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. తాను పిల్లాడిలా మారిపోయాడు. తమ పిల్లలు సితార, గౌతమ్‌లతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఓ ఫోటోని దర్శకుడు మెహర్‌ రమేష్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇందులో మహేష్‌, గౌతమ్‌, సితారలతోపాటు మెహర్‌ రమేష్‌ తనయ మోను ఉన్నారు. `మహేష్‌ సూపర్‌ స్టార్‌. కానీ ఆయనలోనూ ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు. ఈ దశాబ్దానికి ఫన్‌, ఫ్రెండ్‌షిప్‌తో వీడ్కోలు పలుకుతూ, 2021కి వెల్‌కమ్‌ చెబుతున్నారు` అని పేర్కొన్నారు. 

తమ పిల్లలతో చిన్న పిల్లాడిలా మారిపోయిన మహేష్‌ క్యూట్‌గా ఆకట్టుకుంటున్నారు. తమ ఇంటి మెట్లపై కూర్చొని దిగిన ఈ ఫోటో సైతం వైరల్ అవుతుంది. మహేష్‌ ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటించనున్నారు. త్వరలో ఇది షూటింగ్‌ ప్రారంభం కానుంది.