నెక్ట్స్ మహేష్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది పూజా కార్యక్రమాలను ప్రారంభించుకుంది. ఈ చిత్ర షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్‌ బయటకొచ్చింది. 

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో సందడి చేయబోతున్నారు. గ్యాప్‌ లేకుండా ఆయన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం `సర్కారు వారి పాట`తో మరో వారంలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఆద్యంతం బోల్డ్ గా, మాస్‌, క్లాస్‌ మేళవింపుగా సాగే ఈ చిత్ర ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. మహేష్‌ బాక్సాఫీస్‌ షేక్‌ చేయడం ఖాయమే అంటున్నారు. మరోవైపు కొత్త సినిమా అప్‌డేట్‌ ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

నెక్ట్స్ మహేష్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది పూజా కార్యక్రమాలను ప్రారంభించుకుంది. ఈ చిత్ర షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్‌ బయటకొచ్చింది. జులై నుంచి ఈ చిత్ర రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ఈ లోపు స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్‌ చేసుకుని రెడీగా ఉండబోతున్నారు త్రివిక్రమ్‌. నటీనటుల ఎంపిక, టెక్నీషియన్లు ఇలా అన్ని ఫైనల్‌ అయ్యాక పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారట త్రివిక్రమ్‌. ఈ సారి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాని త్వరగా కంప్లీట్‌ చేసుకుని రాజమౌళితో చేయబోయే ప్రాజెక్ట్ లో మహేష్‌ బిజీ కాబోతున్నట్టు టాక్‌. మహేష్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. 

ఇక ఈ నెల 12న విడుదల కాబోతున్న మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో కీర్తిసురేష్‌ కథానాయికగా నటిస్తుంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నెల కిషోర్, సముద్ర ఖని, నదియా, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. విడుదలైన రెండు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌ అయ్యారు. రేపు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతుంది.