మహేష్‌బాబు `శ్రీమంతుడు` సినిమా తర్వాత తన ఊరు బుర్రిపాలెంని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను గుండె ఆపరేషన్స్ చేయించి ఎంతో మంది చిన్నారులకు జీవితాలను అందిస్తున్నారు. 

ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్‌ హార్ట్స్ ఫౌండేషన్స్  తో కలిసి మూడున్నరేళ్లలో వెయ్యి మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించారు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్‌ ని విజయవంతంగా చేయించి తమ ఫ్యామిలీలో కలిపేసుకున్నారు. 

ఈ విషయాన్ని మహేష్‌ భార్య, నటి నమ్రత పేర్కొన్నారు. `మరో రెండు గుండెలు మా కుటుంబంతో కలిశాయి. ఇటీవల గుండె ఆపరేషన్స్ చేయించుకున్న ఇద్దరు చిన్నారులు ఆరోగ్యం కుదుటపడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సపోర్ట్ చేస్తున్న ఆంధ్రా హాస్పిటల్స్ కి కృతజ్ఞతలు` అని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది.