`రైటర్ పద్మభూషణ్`పై మహేష్ రివ్యూ.. టీమ్‌కి ప్రశంసలు.. ఏమన్నాడంటే?
సుహాస్ నటించిన `రైటర్ పద్మభూషణ్` గత శుక్రవారం విడుదలై మంచి ఆదరణ పొందుతుంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ చూశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాపై ప్రశంసలు కురిపించారు.

`కలర్ ఫోటో` ఫేమ్ సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ `రైటర్ పద్మభూషణ్`. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై ఆకట్టుకుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరిని అలరిస్తుంది. రైటర్ కావాలనుకునే కుర్రాడి కష్టాల్లో పుట్టే ఫన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుంది. థియేటర్లలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దీనికి ఆడియెన్స్, క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
తాజాగా ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ తిలకించారు. ఆయనకు ప్రత్యేకంగా షో వేసింది టీమ్. సినిమా చూసిన అనంతరం `రైటర్ పద్మభూషణ్`పై తన దైన రివ్యూ ఇచ్చారు మహేష్ బాబు. ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా అని ట్వీట్ చేశారు. ఇందులో చెబుతూ, `రైటర్ పద్మభూషణ్` సినిమా చూసి బాగా ఆనందించాను. హృద్యమైన చిత్రం. ముఖ్యంగా క్లైమాక్స్ కుటుంబాలు తప్పని సరిగా చూడాల్సిన సినిమా. ఇందులో సుహాస్ నటన చాలా బాగుంది. హిట్ అందుకున్న నిర్మాత శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ షణ్ముఖ్, టీమ్‌కి అభినందనలు` అని ట్వీట్ చేశారు మహేష్. ఇందులో చిత్ర బృందంతో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో షేర్ చేశారు.
తమ సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేష్‌కి ధన్యవాదాలు తెలియజేసింది యూనిట్. సూపర్ స్టార్ కామెంట్ తమ సినిమాకి పెద్ద బూస్ట్ ఇచ్చిందన్నారు. ఇక సుహాస్, తీనా శిల్పారాజ్ జంటగా నటించిన `రైటర్ పద్మభూషణ్` చిత్రంలో రోహిణీ, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ, గౌరి ప్రియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించగా, ఛాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై అనురాగ్‌ర ఎడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మించారు. ఈ నెల 3న ఈ చిత్రం విడుదలైంది.
గొప్ప రైటర్‌గా పేరుతెచ్చుకోవాలనుకుంటాడు పద్మభూషణ్.. లైబ్రరీలో పనిచేస్తుంటాడు. ఎన్నో కష్టాలు పడి ఓ పుస్తకం ప్రింట్ చేస్తాడు. అది సేల్ కాదు. అందుకోసం అనేక తిప్పలు పడుతుంటాడు. ఈ క్రమంలో తన పేరుతో మరో పుస్తకం ప్రింట్ అయి అది బాగా సేల్ అవుతుంది. దీంతో అది తనే అని చెప్పుకుంటూ పాపులర్ అవుతాడు పద్మభూషణ్, మరి ఆ పుస్తకం రాసిందెవరు? దాన్ని పద్మభూషణ్ ఎలా కనిపెట్టాడనేది కథ. మహిళలు, పెళ్లైన ఆడవాళ్ల కోరికల గురించి చర్చిందీ చిత్రం.