బిగ్‌ బాస్‌ తెలుగు 7 వ సీజన్‌ ముగింపుకి చేరుకుంది. మరికొన్ని గంటల్లో షో క్లోజ్‌ కాబోతుంది. అయితే గ్రాండ్‌ఫినాలేకి మహేష్‌బాబు గెస్ట్ గా వస్తారని అన్నారు. కానీ చివరి నిమిషంలో.. 

`బిగ్‌ బాస్‌ తెలుగు 7`వ సీజన్‌ 105 రోజులు పూర్తి చేసుకుంది. నేడు ఆదివారం(డిసెంబర్‌ 17) గ్రాండ్‌గా ఫినాలే ఈవెంట్‌ జరగబోతుంది. ఆల్‌ రెడీ ఫినాలే షూట్‌ ప్రారంభమైంది. రెండు రోజులుగా ఈ షూట్‌ జరుగుతూనే ఉంది. ఇప్పటికే టాప్‌ 6 నుంచి నలుగురు ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తుంది. టైటిల్‌ కోసం పోటీలో ఉన్నాడనుకునే శివాజీ కూడా ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తుంది. 

తాజాగా బిగ్‌ బాస్‌ తెలుగు 7 షో ఫినాలే ప్రోమో విడుదలైంది. ఇందులో స్టార్స్ హంగామా మామూలుగా లేదు. మొత్తం తెలుగు రాష్ట్రాల అటెన్షన్‌ మొత్తం తమ వైపే తిప్పేలా భారీ స్టార్స్ ని దింపారు. రవితేజ, నరేష్‌, రాజ్‌ తరుణ్‌, సుమ, ఆమె కొడుకు, అలాగే బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ల పర్‌ఫెర్మెన్స్ లు ఇలా ఆద్యంతం సందడిగా ఈవెంట్‌ జరిగిందని ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. 

అయితే యావర్‌ 15 లక్షల సూట్‌ కేసుతో జంప్‌ అయినట్టు తెలుస్తుంది. శివాజీ మూడో స్థానంలో ఎలిమినేట్‌ అయ్యాడట. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్ మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఓటింగ్‌ ప్రకారం, అనేక ప్రిడిక్షన్స్ ప్రకారం ఈ సారి విన్నర్‌ కామన్‌ మ్యానే అంటున్నారు. పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌గా కన్ఫమ్‌ అయ్యాడని తెలుస్తుంది. అయితే చివర్లో మళ్లీ సూట్‌ కేస్‌ ఆఫర్‌ ఉంటుందా? లేక టైటిల్‌ పోరే ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

ప్రతి సీజన్‌లో టాలీవుడ్‌కి చెందిన గెస్ట్ ల చేత విన్నర్స్ ని ప్రకటిస్తారు. గత సీజన్లలో పలు స్లార్లు వచ్చారు నాల్గో సీజన్‌లో చిరంజీవి వచ్చారు. ఐదో సీజన్‌లో నాగార్జునే ప్రకటించారు. ఆరో సీజన్‌లో గెస్ట్ ల అవసరమే లేకుండా జరిగింది. ఇప్పుడు ఏడో సీజన్ లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు గెస్ట్ గా వస్తారని అన్నారు. ఆల్మోస్ట్ ఫైనల్‌ అయ్యిందని సమాచారం. కానీ అనూహ్యంగా మహేష్‌ ఈ ఈవెంట్‌ కి రావడం లేదట. ఆయన వ్యక్తిగత కారణాలతో రాలేకపోయినట్టు తెలుస్తుంది. 

చివరి నిమిషంలో ఈ ట్విస్ట్ చోటు చేసుకుందని అంటున్నారు. అయితే మరి నాగార్జున ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయనే విన్నర్స్ ని ప్రకటిస్తారా? లేక ఈ గ్యాప్‌లో ఎవరినైనా గెస్ట్ లను ఆహ్వానిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ చాలా వరకు నాగార్జునే విన్నర్స్ ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.