Asianet News TeluguAsianet News Telugu

ఇత్తడైపోదంటున్న మాధవి లత.. అంత ఫైర్‌ ఎందుకో?

మాధవిలత రెండేళ్ళ క్రితం బీజేపీలో చేరింది. గత ఎన్నికల్లో యాక్టివ్‌గా ఉన్నారు. చాలా రోజులుగా సెలైంట్‌గా ఉన్న మాధవిలత తాజాగా ఉన్నట్టుండి తన అసలు విశ్వరూపం చూపించారు. రాజకీయ నాయకులపై, సోషల్‌ మీడియాలోని కొందరిపై ఫైర్‌ అయ్యారు. ఘాటైన వ్యాఖ్యలతో విరుచుపడ్డారు. 

maheshbabu heroine madhavilatha fired at her rivals
Author
Hyderabad, First Published Aug 3, 2020, 10:54 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మాధవిలత.. మహేష్‌బాబు హీరోగా రూపొందిన `అతిథి` సినిమాతో నటిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. కర్నాటకలో పుట్టినా తెలుగమ్మాయి అనిపించుకుంది. తెలుగులోనే సినిమాలు చేసింది. నానితో `స్నేహితుడా`, `నచ్చావులే`, `అరవింద్‌ 2` చిత్రాలతో క్యూట్‌ అండ్‌ కూల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే చిన్న చిన్న సినిమాలకే పరిమితం కావడంతో కెరీర్‌లో లాంగ్‌ రన్‌ లేదు. బహుశా గ్లామర్‌ వంటి పలు విషయాల్లో కఠినంగా ఉండటం వల్లే ఆఫర్స్ రావడం లేదనే టాక్‌ కూడా ఉంది. దీంతో ఆమె కెరీర ఐదేళ్ళ క్రితమే క్లోజ్‌ అయ్యింది. 

ఇక సినిమాలు తనకి పడవని నిర్ణయించుకుంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మాధవిలత రెండేళ్ళ క్రితం బీజేపీలో చేరింది. గత ఎన్నికల్లో యాక్టివ్‌గా ఉన్నారు. చాలా రోజులుగా సెలైంట్‌గా ఉన్న మాధవిలత తాజాగా ఉన్నట్టుండి తన అసలు విశ్వరూపం చూపించారు. రాజకీయ నాయకులపై, సోషల్‌ మీడియాలోని కొందరిపై ఫైర్‌ అయ్యారు. ఘాటైన వ్యాఖ్యలతో విరుచుపడ్డారు. అసలు మాధవిలతేనా ఇలా మాట్లాడేది అనేంతగా బూతు పురాణంతో రెచ్చిపోయింది. మొత్తానికి కొందరికి మాత్రం స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. పిచ్చి పిచ్చి చేస్తే ఇత్తడైపోద్ది అని హెచ్చరించింది. ఈ మేరకు ఆమె ఫేస్‌బుల్‌లో ఓ పెద్ద పోస్ట్ పెట్టింది. ఇందులో తనపై కామెంట్‌ చేసే రాజకీయ నాయకులను, సినీ వర్గాలను, సోషల్‌ మీడియా వారిని బ్యాక్‌ టూ బ్యాక్‌ ఉతికి ఆరేసింది. 

ఇంతకి మాధవిలత ఏం చెప్పిందో చూస్తే.. `నేను పార్టీలో చేరినప్పుడు ఏదైతే చెప్పానో, ఇప్పుడు అదే మాట మీద ఉన్నా. నా పార్టీ వారినైనా తప్పు చేస్తే తప్పే బారాబర్ చెప్తా. నన్ను దూరం పెడతారనే భయం లేదు. దూరమవుతా అనే బెంగ లేదు. నేనెప్పుడూ దేశం కోసం ధర్మం కోసం పని చేస్తా. మనుషుల కోసం.. వత్తాసుల కోసం కాదు. సమయం సందర్భం చూసి ఎవరు ఎక్కడ రాజకీయ కుట్రలు చేస్తున్నారో చెప్పేస్తా. మోడీజీ స్టయిల్‌లో వారి పేరు మాత్రం చెప్పను. కానీ ఎదుటోడికి తెలిసిపోద్ది ఇత్తడైపోద్ది. ఇది పగ కాదు,  ప్రతీకారం కాదు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి బాధ్యతారాహిత్యంగా ఉండటం తప్పు. తమ సొంత అవసరాలకి ఆబ్లిగేషన్స్‌కి లొంగటం తప్పు. నా అదృష్టానికి కాదు ఇప్పటివరకు జనాల అదృష్టానికి నా జోలికి ఎవరు రాలేదు. అందరు పద్దతిగా.. మర్యాదగా.. హుందాగా నాతో వ్యవహరించారు. అందుకే నేనెప్పుడు ఏం మాట్లాడలేదు. వృత్తిపరంగా బాధ్యతలు తప్పేవాళ్ళకి అప్పుడప్పుడు చురకలు వేస్తూనే ఉంటా` అని తెలిపింది. 

ఇంకా చెబుతూ, `నేను ప్రజల కోసం పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను, ఎవరికీ బానిసని కాను, ఊడిగం చేయను. సినిమా రంగంలో సమస్యలు తెలిసే వచ్చా. పోరాడే తెలివి ఉంది కనుక అలాగే బతికా. రాజకీయంలో చదరంగం తెలిసి ఉండాలి. నాకు అంతగా రాదు అయినా తెగించి వచ్చా. పోరాడే శక్తీ ఉంది. నా బలం నా ధైర్యమే. ఎవరికీ భయపడే పని లేదు. నాకు నచ్చి వచ్చాను.. నచ్చకపోతే వెళ్ళిపోతాను, ఎవరికీ నన్ను ప్రశ్నించే హక్కు లేదు. సమాజ సేవ అనేది నా సొంత బాధ్యత నా సొంత ఆలోచన నేను ఎవరికీ బానిసను కాను, జవాబుదారీ కాను. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా ఏమో చెప్పాలి అనిపించింది చెప్తున్నా` అని పేర్కొంది. 

అంతటితో ఆగలేదు, ఇంకా అనేక విషయాలు పంచుకుంది. పలువురిని ఓ చెడుగుడు ఆడేసుకుంది. `పార్టీ ఎప్పటికి మంచిదే కానీ మనుషులంతా మంచోళ్ళా అంటే ఎప్పటికి కాదు అనే అంటాను. నా వలన ప్రజలకి మంచి జరుగుతుందేమో అని ఆశ. ఆశ లేకుంటే మనిషి బతకడం ఎందుకు?. ఎవరి రాజకీయ కుట్రలకు నేను బలియైపోను ఎవరిని సహించను. నేనింతే మీకు ముక్కు సూటితనం పనికొస్తాదా అంటే.. వచ్చిన రాకున్నా నేనెవరికోసం తెర వెనక నటించే పని లేదు. నా వ్యక్తిగత జీవితం ఎవరికైనా అనవసరం పక్కవాళ్ళ జీవితంలో వేలు కాళ్ళు పెట్టడం సంస్కార హీనం, నీచం. సోషల్ మీడియా సైకోలకి చెప్తున్నా.. మీ అమ్మ నాన్న నేర్పించలేదేమో పక్కవాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం అంటే అది నీచం ఛండాలం అది క్రైమ్ అని. 

 కావున ఎవరి జీవితాల జోలికి ఎవరు వెళ్ళకపోవడం మంచిది ఇక్కడెవరు మంచోళ్ళు లేరు మడి కట్టుకున్నోళ్ళు లేరు.. మీ జీవితం మీరు చూసుకుంటే గొప్పవాళ్ళు అవుతారు. కాదు ఎప్పుడు ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో పరాయివాళ్ల మీద బూతులు అవాకులు.. చవాకులు ఏడుస్తుంటే అలానే ఏడుస్తూనే ఉంటారు. అంతో ఇంతో అమ్మ నాన్నకు పుట్టి ఉంటే పద్దతిగా ఉండండి, కాదు మాకు వేరే పని లేదు మేం ఎపుడు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తాం.. ఇదే మా పని పక్కింట్లోకి తొంగి చూస్తే, పడక గదిలో కెమెరాలు పెడతాం ఫేస్‌బుక్‌లో దూరి జనాలని తిడతాం అంటే మీ కర్మకి మీరే బాధ్యులు. పక్కవారి మంచి కోరుకుంటే మీరు బాగుంటారు. కాదు పరాయివల్ల నాశనం కోరుకుంటే అంత చెడ్డోళ్లు.. మేమే మంచోళ్ళమ్ అనుకుంటూ నీచంగ దిగజారేవాళ్లకి ఎప్పటికి దిగజారుడు బతుకుగానే ఉంటుంది` అని మండిపడింది. 

ఇంకా ఆమె స్పందిస్తూ, `మన కదలిక పది మందికి సంతోషాన్ని ఇవ్వాలి.. అశాంతిని కాదు. మీ మాటలు, మీ నవ్వు, పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే మీరు సరిగ్గా లేనట్లు. ఒకరిని సంతోష పెట్టకపోయినా ఫర్వాలేదు, బాధ పెట్టొద్దు. ఎవరి అశాంతికి కారణం కావొద్దు. మీ మనశ్శాంతికి ఎవరు భంగం కలిగించినా దూరంగా ఉండండి. అలాంటి వారి నీడ కూడా పడనివ్వకండి అని నా సలహా. నా ఇష్టం` అంటూ మాధవిలత పెద్ద నోట్‌ రాసింది. మొత్తానికి తనంటే పడని వారికి దిమ్మతిరిగిపోయేలా వార్నింగ్‌ ఇచ్చి తన విశ్వరూపం బయటపెట్టింది ఈ మాజీ హీరోయిన్‌. మరి దీనిపై ఆమె ప్రత్యర్థులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios