లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేష్‌బాబు ఫ్యామిలీ.. ఫుడ్, స్టోరీస్, బాండింగ్.. నమ్రత ఇంట్రెస్టింగ్ పోస్ట్
మహేష్‌బాబు తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల విదేశాలకు వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. నమ్రత పోస్ట్ వైరల్ అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్‌బాబు ఖాళీ టైమ్ దొరికిందంటే వెకేషన్‌కి వెళ్లిపోతారు. ఫ్యామిలీతో కలిసి ఫారెన్ చెక్కేస్తారు. కొన్ని రోజులు ఎంజాయ్ చేసి, రిలాక్స్ అయి మళ్లీ రెట్టింపు ఎనర్జీతో తిరిగి వస్తారు. తాజాగా మహేష్, నమ్రత.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లారు. ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో వీరి మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు మహేష్ ఫ్యామిలీ. అక్కడ తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడుపుతున్నారు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది నమ్రత. ఇందులో తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోలను పంచుకున్నారు నమ్రత. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే ఈ ఫోటోలకు ఓ క్యాప్షన్ ఇచ్చింది నమ్రత. `ఆహారం, కథలు, ఆనందాలను పంచుకోవడంలో బంధం` అంటూ పేర్కొంది. డిన్నర్ చేసుకుంటూ సరదాగా స్టోరీస్ చెప్పుకుంటూ హ్యాపీగా గడిపినట్టు తెలిపింది నమ్రత. నెట్టింట ఆమె పోస్ట్, ఫోటోలు వైరల్ అవుతూ అలరిస్తున్నాయి.
ఇందులో మహేష్ ఓ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. మహేష్ హెయిర్ స్టయిల్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇందులో కాస్త కొత్తగా కనిపిస్తున్నారు. హెయిర్ స్టయిల్ డిఫరెంట్‌గా ఉంది. అంతేకాదు చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు మహేష్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి వీరంతా సరదా టైమ్‌ని గడిపారు. దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ మహేష్ అన్న లుక్ కేక అని, ఐదు ఏళ్లు దగ్గరపడుతున్నా టీనేజ్ కుర్రాడిలా ఉన్నారంటున్నారు. మహేష్‌ని బాగా చూసుకో వదినా అంటూ నమ్రతకి సూచిస్తున్నారు.
ప్రస్తుతం మహేష్‌బాబు `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షెడ్యూల్ పూర్తయ్యింది. దీంతో వెకేషన్ చెక్కేశారు. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించబోతున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. మరో కథానాయిక ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. హారికా అండ్ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.