బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌కి బర్త్ డే విశెష్‌ల వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మహేష్‌బాబు.. షారూఖ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్‌ వేదికగా బాద్‌షాకి విశెష్‌ చెప్పారు. `నాకు తెలిసిన అత్యంత వినయపూర్వకమైన వ్యక్తుల్లో ఒకరైన షారూఖ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఎల్లప్పుడు ఆనందంతో, గొప్ప ఆరోగ్యం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోలుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు. మహేష్‌. 

ఈ సందర్భంగా షారూఖ్‌తో దిగిన ఫోటోని పంచుకున్నారు. ఇందులో షారూఖ్‌ ఏదో విషయం చెబుతుండగా, మహేష్‌, ఆయన భార్య నమ్రత వింటున్నారు. ఇదొక సినిమా షూటింగ్‌లో జరిగిన సన్నివేశంలా ఉంది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇరు హీరోల ఫ్యాన్స్ దీన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. మరోవైపు  సినీ సెలబ్రిటీలు షారూఖ్‌కి బర్త్ డే విశెష్‌ చెబుతున్నారు. ఇందులో బాలీవుడ్‌ ప్రముఖులు ప్రధానంగా ఉన్నారు. నేడు షారూఖ్‌ 55వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు.