మెహర్ రమేష్.. ఈ పేరు స్టార్ హీరోల అభిమానులు అస్సలు మర్చిపోలేరు. ముఖ్యంగా నందమూరి అభిమానులకు ఎక్కువగా గుర్తుంటుందని చెప్పవచ్చు. కంత్రి లాంటి డిజాస్టర్ ఇచ్చినా కూడా ఎన్టీఆర్ మరోసారి భారీ బడ్జెట్ సినిమా శక్తి తో అవకాశం అచ్చాడు. ఆయినా సరే రమేష్ ఎన్టీఆర్ కి హిట్ ఇవ్వలేకపోయాడు. 

టాలీవుడ్ లో బిల్లా తప్పితే అతను ఏ సినిమాతో కూడా మెప్పించలేకపోయాడు. ఇక షాడో సినిమాతో దాదాపు డైరెక్షన్ కి దూరంగా ఉంటున్నాడు. ఇకపోతే మెగా ఫ్యామిలీ బంధువైన ఈ టెక్నీషియన్ మహేష్ బాబుకి ముందు నుంచి క్లోజ్ ఫ్రెండ్. 2002లో వచ్చిన బాబీ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఇకపోతే ఈ మధ్య మహేష్ తో ఎక్కువగా కనిపిస్తుండడంతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నాడా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. 

రీసెంట్ గా మహేష్ తన AMB సినిమాస్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా మెహర్ రమేష్ మహేష్ తో క్లోజ్ గా కనిపించడంతో కొన్ని రూమర్స్ వచ్చాయి. అసలు రీజన్ ఏమిటంటే.. ఇప్పుడు మహేష్ కు సంబంధించి బయటి విషయాలు ఏమున్నా కూడా రమేష్ దగ్గరుండి చూసుకుంటున్నాడని ఇన్ సైడ్ టాక్. డేట్స్, బిజినెస్ కి సంబందించిన డేట్స్ కాల్స్ సెక్యూరిటీ తో పాటు పర్సనల్ గా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లిన మహేష్ ప్లానింగ్ చేస్తాడట. ఈ విధంగా మహేష్ స్నేహితుడికి తన దగ్గరే ఒక పని కల్పించినట్లు తెలుస్తోంది.