వింటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఖచ్చితంగా కంటెంట్ ఎలా ఉన్నా ఓపినింగ్స్ అదిరిపోతాయి. బిజినెస్ కేక పెట్టిస్తుంది. స్టార్ ప్రొడ్యూసర్స్ అసూయ మిగులుస్తుంది. అయితే ఈ ఆలోచన ఎవరిది..అసలు జరిగే పనేనా అంటే ఇప్పటిదాకా ఉన్న సమాచారాన్ని బట్టి జరిగే అవకాసమే ఎక్కువ ఉందని తెలుస్తోంది. అసలేం జరిగింది..ఈ కాంబినేషన్ ఐడియా ఎవరు...దర్శకుడు ఎవరూ వంటి విషయాలు తెలియాలంటే ఈ ఇంట్రస్టింగ్ ఇన్ఫో చదవాల్సిందే.

గత కొంతకాలంగా ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి ...మహేష్ డేట్స్ కోసం చక్కర్లు కొడుతున్నాడు. ముఖ్యంగా  'మహర్షి' హిట్ తర్వాత తన తదుపరి సినిమా మహేష్ బాబుతోనే అనుకున్నారు. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. రకరకాల కారణాలతో పరుశరామ్ సీన్ లోకి వచ్చాడు. అలాగని వంశీ పైడిపల్లికి, మహేష్ కు చెడిందని కాదు. వారిద్దరి స్నేహం అలాగే ఉంది. దాంతో వంశీ పైడిపల్లి తన కోసం రెడీ చేసిన కథను మహేష్ ఎలాగైనా పట్టాలు ఎక్కించాలనుకున్నాడు. ఈ క్రమంలో తను కాకుండా ఏ హీరో అయితే ఆ ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందో అని ఆలోచించి రామ్ చరణ్ అయితే బెస్ట్ అని డిసైడ్ అయ్యాడట.   

వంశీ పైడిపల్లి చెప్పిన కథకి రామ్ చరణ్ సెట్ అవుతాడనీ,  అతన్ని ఒప్పిస్తే తాను నిర్మిస్తానని వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు అన్నారని సమాచారం.  గతంలో ఇదే దర్శకుడుతో 'ఎవడు' సినిమాతో చరణ్ కి హిట్ ఇచ్చిన కారణంగా ,  వంశీ పైడిపల్లికి ఎంతో చనులు వుంది. ఈ క్రమంలో చరణ్ కి వంశీ పైడిపల్లి ఆ కథను వినిపించడం, ఆ కథకి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయిందని తెలుస్తోంది. అన్నీ సెట్ అయితే ఈ సినిమాకి రామ్ చరణ్ కూడా బిజినెస్ పార్టనర్ గా వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు.