మహర్షి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న మహేష్ ఎప్పటిలానే సినిమా సక్సెస్ అనంతరం విదేశాలకు పయనమయ్యాడు. ఫ్యామిలీతో కలిసి వివిధ ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. హాలిడే ట్రిప్ లో భాగంగా ఈ సారి స్పెషల్ గా మహేష్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ వీక్షించనున్నాడు. 

ఇంగ్లాండ్ లో జరగనున్న ఆస్ట్రేలియా vs ఇండియా మ్యాచ్ చూడడానికి స్పెషల్ విఐపి కోటాలో టికెట్స్ బుక్ చేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ జాతీయ జెండా పట్టుకొని భారత జట్టుకు సపోర్ట్ చేయనున్నాడు. మహేష్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. 

సినీ ఫీల్డ్ లోకి వచ్చాక క్రికెట్ కు దూరమైన మహేష్ చాలా రోజుల తరువాత లైవ్ మ్యాచ్ చూడటానికి రెడీ అయ్యాడు. నిన్ననే జర్మనీ నుంచి మహేష్ కుటుంబంతో ఇంగ్లాండ్ చేరుకున్నాడు. భారత కాలమానం ప్రకారం నేడు 3 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. మహేష్ తో పాటు వెంకటేష్ కూడా ఈ మ్యాచ్ ను వీక్షించనున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

London bound ♥♥♥ #CelebratingMaharshi

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on Jun 8, 2019 at 9:03am PDT