సూపర్‌స్టార్ మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రానికి ఓ ఆసక్తికర టైటిల్ వైరల్ అవుతుంది.
సినిమాలకు ప్రస్తుతం పెద్ద ఛాలెంజ్ ఏదైనా ఉందంటే అది ఒకటి స్టార్ హీరోలకు హీరోయిన్లు సెట్ కావడం, రెండు టైటిల్స్ కన్ఫమ్ కావడం. ఈ రెండు ఒక పట్టాన ఓకే కావు. సోషల్ మీడియాలో, అటు చిత్ర పరిశ్రమలో నానుతూ ఉంటాయి. వీటిపైనే ప్రధానంగా రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి. ఇదే పెద్ద చర్చనీయాంశంగానూ మారుతుంటుంది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు ఏదీ నిజం కాదన్నట్టుగానే ఉంటుంది. అన్ని రూమర్స్ గానే పరిగనించబడతాయి. అయితే ఈ లోపు ఫ్యాన్స్ మాత్రం తమకు నచ్చిన, వినిపించే పేర్లని వైరల్ చేస్తుంటారు.
తాజాగా సూపర్‌స్టార్ మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఇది పూజా కార్యక్రమాలు జరుపుకున్న నేపథ్యంలో ఇక రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. పక్కా ప్లానింగ్‌తో శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది త్రివిక్రమ్ టీమ్. అందుకోసం ముందస్తు కార్యక్రమాలపై మాటల మాంత్రికుడు ఫుల్ ఫోకస్ పెట్టారని సమాచారం. స్క్రిప్ట్ కూడా లాక్ చేసినట్టు సమాచారం.
ఇదిలా ఉంటేఈ చిత్రానికి టైటిల్ ఏంటనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి `అర్జునుడు` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. సినిమా కమర్షియల్ వేలో ఉండబోతుందని టాక్. మరి `అర్జునుడు` టైటిల్ ఎలా సెట్ అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే త్రివిక్రమ్‌కి `అ` అనేది సెంటిమెంట్. ఆయన రూపొందించిన చిత్రాల్లో చాలా వరకు మొదటి అక్షరం `అ` ఉంటుంది. `అతడు`, `అ ఆ`, `అజ్ఞాతవాసి`, `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` వంటి చిత్రాలన్నీ `అ`తోనే స్టార్ట్ అయ్యాయి. ఒక్క `అజ్ఞాతవాసి` సినిమా తప్ప అన్ని బ్లాక్ బస్టర్సే కావడం విశేషం. దీంతో అదే సెంటిమెంట్‌ని త్రివిక్రమ్ ఫాలో అవుతున్నారట.
ఇదిలా ఉంటే మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన `అతడు` సినిమాలో హీరో పేరు పార్థు. అదే టైటిల్‌గా పెట్టబోతున్నారనే టాక్ కూడా వినిపించింది. అయితే అర్జునుడు మరో పేరు పార్థు కావడంతో `అర్జునుడు`గా ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్. మే 31న కృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసే ఛాన్స్ ఉందని టాక్. మరోవైపు మహేష్ ఇప్పటికే `అర్జున్` పేరుతో ఓ సినిమా చేశారు. ఇది బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. మళ్లీ అలాంటి పేరునే టైటిల్‌గా పెడతారా? అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి ఫైనల్‌గా ఏది ఖరారు అవుతుందనే తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
