మొత్తానికి మహేష్ బాబుకు, సుకుమార్ కు మధ్య మనస్పర్దలు తొలిగిపోయినట్లే అని తెలుస్తోంది. సుకుమార్ చెప్పిన విషయాలు, అసలు ప్రాజెక్టు ఎనౌన్సమెంట్ వెనక ఏం జరిగింది అనేది పూర్తిగా మహేష్ విన్నారట. తను కూడా ఎంత హర్ట్ అయ్యాడో , బాధపడ్డారో సుకుమార్ చెప్పుకున్నారట. 

మహేష్ కూడా తను ఫీలయ్యానని, ఒక్కమాట కూడా తనతో అనకుండా ప్రాజెక్టు ఎనౌన్స్ చేయటం పద్దతి కాదన్నారని తెలుస్తోంది. ఏదైతేనేం ఈ వీకెండ్ లో చెన్నైలో జరిగిన మీటింగ్ లో ఇద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకున్నారట. త్వరలోనే తిరిగి కలిసి పనిచేద్దామని ఒకరికొకరు బెస్ట్ విషెష్ చెప్పుకున్నారుట. 

దాంతో సుకుమార్ ఇప్పుడు పూర్తి స్దాయిలో హ్యాపీగా తన ప్రొడక్షన్స్ మీదా, తను డైరక్ట్ చేయబోయే చిత్రం మీదా కాన్సర్టేట్ చేయనున్నారు. మహేష్ తో అనుకున్న ఎర్ర చందనం కథనే అల్లు అర్జున్ తో చేయబోతున్నారట. అయితే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చిత్రం పూర్తయ్యాకే ఆ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ లోగా తన అసెస్టెంట్స్ డైరక్ట్ చేస్తున్న సినిమాలను సుకుమార్ పూర్తి స్దాయిలో పట్టాలు ఎక్కించి, పర్యవేక్షించనున్నారు. 

అక్టోబర్ నుంచి అల్లు అర్జున్ డేట్స్ ఇస్తారని జూలై నుంచి స్క్రిప్టు మీద మరోసారి కూర్చుంటారని, అప్పటిదాకా బ్రేక్ ఇస్తారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ని డిఫరెంట్ గెటప్ లో చూపించబోతున్నారని, సినిమా మొత్తం రా గా ఉంటుందని, అడవిలో జరిగే ఓ ఇన్విస్టిగేషన్ డ్రామా అని చెప్తున్నారు. రంగస్దలాన్ని మించి హిట్ కొట్టాలనే పట్టుదలతో సుకుమార్ ఉన్నారు.