మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్ర యూనిట్‌ స్పందించి గాలి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో రకరకాల వార్తలు స్ర్పెడ్‌ అవుతున్న నేపథ్యంలో యూనిట్‌ స్పందించి వివరణ ఇచ్చింది. 

మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్ర యూనిట్‌ స్పందించి గాలి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో రకరకాల వార్తలు స్ర్పెడ్‌ అవుతున్న నేపథ్యంలో యూనిట్‌ స్పందించి వివరణ ఇచ్చింది. షూటింగ్‌కి సంబంధించిన విషయాలపై తాము ప్రకటిస్తామని తెలిపింది. సినిమాపై ఎగ్జైట్‌మెంట్‌ గాల్లో ఉందని, దానికి తగిన విధంగా అప్‌డేట్‌ ఉంటుందని తెలిపింది. అప్పటి వరకు ఇంట్లోనే ఉండాలని, సేఫ్‌గా ఉండాలని తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

`షూటింగ్‌ స్టార్ట్ అయిన తర్వాత `సర్కారు వారి పాట` సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ మేం ప్రకటిస్తాం. అప్పటి వరకు సేఫ్‌గా ఉండండి. కోవిడ్‌ ప్రోటోకాల్‌ ఫాలో కండి` అని తెలిపింది. దీంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇంకా ఎన్ని రోజులనీ, అందరు అప్పటి వరకు నోరు మూస్కోండి, వెయిటింగ్‌ తప్పదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Scroll to load tweet…

మహేష్‌ హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రం రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్ ప్లస్‌ పతాకాలపై తెరకెక్కుతుంది. ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్‌ని నిలిపివేసిన విషయం తెలిసిందే.