Asianet News TeluguAsianet News Telugu

#Gunturkaaram లీక్: 'నెక్కిలీసు గొలుసు'అంటూ మహేష్ ,శ్రీలీల రచ్చ

ఆ రచ్చకు థియేటర్స్ ఊగిపోతాయంటున్నారు. ఓ రేంజి మసలాని సినిమాలో త్రివిక్రమ్ ఈ సారి గుప్పించి వదులుతున్నారట. 
 

Mahesh Sreelela To Dance For Naadhi Necklace Golusu jsp?
Author
First Published Jan 3, 2024, 4:03 PM IST


సంక్రాంతి పండగకి వస్తున్న మహేష్ బాబు 'గుంటూరు కారం'  సందడి మొదలైపోయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని  ఎదురుచూస్తున్న అభిమానులు, థియేటర్స్ ముందు మహేష్ బాబు కట్ ఔట్స్ పెట్టి హంగామా చెయ్యడం కూడా మొదలెట్టేసారు. మరో ప్రక్క ఈచిత్రం నుంచి కొన్ని అప్డేట్స్ లీక్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రస్టింగ్ మేటర్ బయిటకు వచ్చింది. అదేమింటంటే..

ఈ సినిమా సెకండాఫ్ లో ... మహేష్ బాబు, శ్రీలీల కలిసి #GunturKaaram మిర్చి గిడ్డంగి లో.. చేసే రచ్చ మామూలుగా ఉండదుట. అక్కడ ఈ ఇద్దరు కలిసి ఒక్కడు సినిమాలోని చెప్పవే చిరుగాలి తో పాటు సూపర్ స్టార్‌ కృష్ణ పాట ఇంకా ఈ నెక్కిలీసు గొలుసు అంటూ రెచ్చబోతారట. ఆ రచ్చకు థియేటర్స్ ఊగిపోతాయంటున్నారు. ఓ రేంజి మసలాని సినిమాలో త్రివిక్రమ్ ఈ సారి గుప్పించి వదులుతున్నారట. 

ఇక  ఈ సినిమాలో మహేష్ బాబు పేరు వెంకట రమణారెడ్డి అలియాస్ రవణ. గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. నలుగురికి సహాయం చేయడమే కాదు అలాగే అవసరమైతే లుంగి ఎగగట్టి ఫైట్ చేసేస్తూంటాడు. అతను బీడీ అంటించాడంటే అవతలి వాళ్లు కూసాలు, బీజాలు కదిలిపోవాల్సిందే.   కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ గా ఉంటుందట. ఫన్ తో కూడిన కొన్ని పొలిటికల్ సెటైర్స్ తో సినిమా ఉంటుందంటున్నారు.   

సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్‌ను ఉద్దేశించి రీసెంట్ గా చిత్ర నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్‌ను ఆయన షేర్‌ చేశారు. ‘‘ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తాం. కంటెంట్‌ విషయంలో నేను నమ్మకంగా ఉన్నా’’ అని ఆయన చెప్పారు.

తాజాగా ఈ వీడియో క్లిప్‌ను షేర్‌ చేసిన ఆయన.. ‘‘మీకు మళ్లీ చెబుతున్నా. మేము అదే మాట మీద ఉన్నాం.‘గుంటూరు కారం’ను భారీగా విడుదల చేస్తాం. రిలీజ్‌ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్‌ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతి బాబు, జయరాం, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు. 
 
  గుంటూరు కారం చిత్రంలో శ్రీలలో పాటు  హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది..  అతడు, ఖలేజా  చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.  మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios