తమ పిల్లల గురించి, మహేష్ బాబు గురించి ఎలాంటి మంచి విషయం ఉన్నా నమ్రత వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంది. తాజాగా గౌతమ్ ఘట్టమనేని గొప్ప మనసు ఏంటో తెలియజేస్తూ నమ్రత చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
మహేష్ బాబు సతీమణి నమ్రత తరచుగా తన ఫ్యామిలీ విశేషాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాయి. మహేష్ కుమార్తె సితార అయితే చూస్తుండగానే క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయింది. యాడ్ షూట్ లు కూడా చేస్తోంది. ఇక మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని కూడా తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
తమ పిల్లల గురించి, మహేష్ బాబు గురించి ఎలాంటి మంచి విషయం ఉన్నా నమ్రత వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంది. తాజాగా గౌతమ్ ఘట్టమనేని గొప్ప మనసు ఏంటో తెలియజేస్తూ నమ్రత చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు.. సేవా కార్యక్రమాల్లో సైతం సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నారు.
వేలాదిమంది చిన్న పిల్లలకు మహేష్ హార్ట్ సర్జరీ చేసి పునర్జన్మ అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం మహేష్ రైన్ బో హాస్పిటల్స్ లాంటి సంస్థలతో చేతులు కలిపి పిల్లలకు గుండె చికిత్స అందిస్తున్నారు. ఇందులో భాగంగా మహేష్ ఫ్యామిలిలో ఎవరో ఒకరు తరచుగా ఆసుపత్రికి వెళుతుంటారట. గౌతమ్ అయితే పలు మార్లు ఆసుపత్రికి వెళ్లి గుండె చికిత్స తీసుకున్న చిన్నారులని చూసి వస్తాడని నమ్రత పేర్కొంది.
తాజాగా గౌతమ్ తన స్కూల్ ముగిసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి హార్ట్ సర్జరీ చేయించుకున్న చిన్నారులని పరామర్శించినట్లు నమ్రత పోస్ట్ చేసింది. అంతే కాదు మానసికంగా వాళ్ళు సంతోషంగా ఉండేలా గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. సరదాగా వారితో మాట్లాడి త్వరగా కోలుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు నమ్రత పేర్కొంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ అభిమానులు, నెటిజన్లు గౌతమ్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంత గొప్ప వ్యక్తికి ఇలాంటి కొడుకే పుడతాడు.. తండ్రి ఎలాగో కొడుకు కూడా అంతే అంటూ ప్రశంసిస్తున్నారు.
