మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట లోని సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కాగా మహేష్ సిస్టర్ మంజుల ఈ సాంగ్ కి స్టెప్స్ వేయగా వీడియో వైరల్ గా మారింది.  

సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) సర్కారు వారి పాట సాంగ్స్ ప్రభంజనం సృష్టిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. ఈ మూవీ నుండి రెండు సాంగ్స్ విడుదల కాగా రెండు సోషల్ మీడియాను షేక్ చేశాయి. సెకండ్ సింగిల్ పెన్నీ... సాంగ్ తో మహేష్ వారసురాలు సితార ఘట్టమనేని వెండితెర ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ సాంగ్ లో సితార స్టైలిష్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్న పెన్నీ సాంగ్ (Penny Song)కి సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు స్టెప్స్ వేస్తున్నారు. 

తాజాగా ఈ లిస్ట్ లో మహేష్ సిస్టర్ మంజుల (Manjula Ghattamaneni) చేరారు. ఆమె పెన్నీ సాంగ్ కి క్రేజీ స్టెప్స్ వేస్తూ ఓ వీడియో చేశారు. సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. చాలా మంది సన్నిహితులు పెన్నీ సాంగ్ కి డాన్స్ చేయాలంటూ కోరుతున్నారట. వాళ్ళ డిమాండ్ మేరకు పెన్నీ సాంగ్ చేశానంటూ మంజుల కామెంట్ చేశారు. మంజుల పెన్నీ సాంగ్ వీడియో వైరల్ గా మారింది. 

View post on Instagram

కృష్ణ వారసురాలిగా మంజుల పరిశ్రమలో రాణిస్తున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా పలు శాఖల్లో పని చేశారు. నిహారిక డెబ్యూ మూవీ ఒక మనసు చిత్రానికి మంజుల దర్శకత్వం వహించారు. ఇక ఆమె హీరోయిన్ గా నటించిన 'షో' చిత్రం నేషనల్ అవార్డు పొందింది. దర్శకుడు నీలకంఠ కేవలం రెండు పాత్రలతో షో ప్రయోగాత్మకంగా తెరకెక్కించారు. నిర్మాతగా నాని, పోకిరి, ఏమాయ చేశావే వంటి చిత్రాలు ఆమె నిర్మించారు. 

ఇక సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) విషయానికొస్తే మహేష్ షూటింగ్ పూర్తి చేశారు. మే 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుంది. దర్శకుడు పరుశురాం సర్కారు వారి పాట చిత్రాన్ని పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పలు కారణాల చేత సంక్రాంతికి విడుదల కావాల్సిన సర్కారు వారి పాట ఆలస్యమైంది. మహేష్ చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలై రెండేళ్లు దాటిపోయింది. దీనితో ఫ్యాన్స్ సర్కారు వారి పాట చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.