పవన్, రానాలు కలిసి నటించిన `భీమ్లా నాయక్` చిత్రంపై సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రశంసలు కురిపించారు. సినిమాని ఆకాశానికి ఎత్తేశాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేయగా, అది వైరల్ అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన `భీమ్లా నాయక్`(Bheemla Nayak) చిత్రంపై సూపర్ స్టార్ మహేష్‌బాబు(Maheshbabu) ప్రశంసలు కురిపించారు. పవన్ నటన ఫైరింగ్ అంటూ, రానా సంచలనం అంటూ అప్రిషియేట్ చేశారు. కాస్ట్ అండ్ క్రూని ఆకాశానికి ఎత్తేశారు. `భీమ్లా నాయక్` ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. Pawan Kalyan ఫైరింగ్ ఫామ్‌లో ఉన్నాడు. ఆయన నటన అద్భుతం. అలాగే డేనియల్ శేఖర్‌గా రానా సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రైటింగ్ ఎప్పటిలాగే పదునైనది. తెలివైనది. ఇటీవల కాలంలో ఉత్తమమైనది. రవి కె చంద్రన్ విజువల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి. ఆయన నా ఫేవరేట్ లెన్స్ మెన్. థమన్ సంగీతం స్పెల్ బౌండ్. హంట్ చేసేలా పాటలున్నాయి. సంచలనం సృష్టిస్తున్నాయి. దర్శకుడు సాగర్ కె చంద్ర, నిర్మాత నాగవంశీ, హీరోయిన్లు నిత్యా మీనన్, సంయుక్త మీనన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్లకి నా అభిమానలు` అని మహేష్ ట్వీట్లు చేశారు. ఇప్పుడవి నెట్టింట వైరల్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి.
జనరల్‌గా మహేష్, పవన్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. బయట వీరిద్దరు కలిసి కనిపించింది చాలా అరుదు. కానీ సినిమాల పరంగా ఒకరికొకరు సపోర్ట్ చేస్తారు. పవన్ `జల్సా` సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఒకరి సినిమాలకు ఒకరు పరోక్షంగా సపోర్ట్ చేసుకుంటున్న నేపథ్యంలో అభిమానులు సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన `భీమ్లా నాయక్` చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంటుంది. బ్లాక్ బస్టర్ రిపోర్ట్ అందుతోంది. తొలి రోజు ఈ చిత్రం 33కోట్ల కలెక్షన్లని రాబట్టినట్టు సమాచారం. మరోవైపు థియేటర్లలోనూ ఇది విజయవంతంగా రన్ అవుతుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నిత్యా మీనన్,సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు.
