సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ఇటీవల స్పీడందుకుంది. పక్కా ప్లానింగ్ తో దర్శకుడు సినిమా షెడ్యూల్స్ ని అనుకున్న సమయానికి ఫినిష్ చేస్తున్నాడు. 

రీసెంట్ గా సినిమా కోసం వేసిన కొండారెడ్డి బురుజు సెట్ లో చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంది. ఫైనల్ గా ఆ షెడ్యూల్ ని ముగించుకున్నట్లు సమాచారం. మహేష్ బాబు అలాగే మరికొంత మంది స్టార్ యాక్టర్స్ తో  తెరకెక్కించిన  ఈ ఎపిసోడ్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయట. ఇకపోతే నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబద్ కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ షెడ్యూల్ లో విజయశాంతి - మహేష్ బాబు మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ ని షూట్ చేయనున్నట్లు టాక్. వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసి డబ్బింగ్ పనులను మొదలుపెట్టాలని చూస్తున్నారు. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.