వరుస విజయాలతో సూపర్ ఫార్మ్ లో ఉన్న మహేష్ నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురామ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్ర కథపై క్రేజీ రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూవీ పైసా చుట్టూ తిరిగే సెటైరికల్ మూవీ అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీలో మహేష్ లుక్ కూడా సరికొత్తగా ఉండనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో మహేష్ మెడపై రూపాయి కాయిన్ టాటూ, పెరిగిన జుట్టుతో డిఫరెంట్ గా ఉన్నాడు. సర్కారు వారి పాట మూవీలో మహేష్ పాత్ర అటిట్యూట్ అండ్ మేనరిజం సరికొత్తగా ఉంటాయట.

 కాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ తరువాత మూవీ ఫస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టాలనేది చిత్ర యూనిట్ ప్రణాళిక అట. ఇప్పటికే దానికి సంబంధించిన అనుమతులు సంపాదించే పనిలో ఉన్నట్లు సమాచారం. నవంబర్ లో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలి అనేది దర్శక నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది. ప్రపంచంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశంగా అమెరికా ఉంది. మరి అక్కడ షూట్ అంటే కొంచెం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. 

దాదాపు ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న చిత్ర పరిశ్రమ కొంచెం తెగించినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో షూటింగ్స్ సందడి మొదలైంది. హీరో అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ షూటింగ్ కొరకు లండన్ వెళ్లడం జరిగింది. మహేష్ కూడా కరోనా అని మడిగట్టుకు కూర్చోవడం అనవసరం అని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఇక సర్కారు వారి పాట మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ ఎంటరైన్మెంట్స్ మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.