వరస పెట్టి బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు చాలా కాలంగా మహేష్ తో పనిచేయాలని కోరిక. సూపర్ స్టార్ తో తమ బ్యానర్ లో సినిమా చేసి సెన్సేషన్ హిట్ కొట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన మహేష్ తోనూ, నమ్రతతోనూ మాట్లాడటం జరిగింది. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక దర్శకుడుని, కథని మహేష్ చేత ఓకే చేయించుకోవటం మిగిలింది. ఈ మేరకు ఆయన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మహేష్ 27వ సినిమాగా ఆ ప్రాజెక్టు చేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు.

అయితే ఏ దర్శకుడుతో మహేష్ ని ఒప్పించాలి అనే విషయమై ఆయన ఆలోచించి..గీత గోవిందం తో ఘన విజయం సాధించిన పరుశరామ్ అయితే ఫెరఫెక్ట్ అని  భావించారట. మహేష్ కు సరపడ స్క్రిప్టు పరుశరామ్ చేత రెడీ చేయించారట. ఈ వారంలోనే కథ చెప్పించబోతున్నారట. అన్ని కలిసి వస్తే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ తో సినిమా ఉంటుంది. అనీల్ రావిపూడి సినిమా పూర్తయ్యాక వచ్చే సంవత్సరం పట్టాలు ఎక్కిస్తారు.

మహేష్ సైతం తనతో ఇప్పటిదాకా పనిచేయని దర్శకులతో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఆయన కథలు వింటున్నారు. సినిమా హిట్..ప్లాఫ్ అనేదానికన్నా  ఓ కొత్త తరహా కథ,కథనాలతో పూర్తి బౌండెడ్ స్క్రిప్టుతో వచ్చే దర్శకులను ఆయన ఎంకరేజ్ చేయటానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగమే అనీల్ రావిపూడి, పరుశరామ్ అంటున్నారు.