చిరంజీవి కరోనాకి గురైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన సోమవారం ప్రకటించారు. తనకు లక్షణాలేవి లేవని, `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొనేందుకు కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్‌, నాగార్జున, సుమ, బిగ్‌బాస్‌ టీమ్‌తోసహ అనేక మంది ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చిరంజీవి కలిసినవారిలో గుబులు పట్టుకుంది. 

ఇదిలా ఉంటే చిరంజీవి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్విట్టర్‌ ద్వారా కోరుకుంటున్నార. మహేష్‌బాబు స్పందిస్తూ, `చిరంజీవి గారు త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా` అని ట్వీట్‌ చేశారు. జాగ్రత్తగా ఉండండి, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు రవితేజ ట్వీట్‌ చేశారు. చిరు కోడలు ఉపాస సైతం స్పందించి `మామయ్యా.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా` అని అన్నారు. వీరితోపాటు దర్శకుడు సురేందర్‌రెడ్డి, హీరో నిఖిల్‌, దర్శకుడు మారుతి, దేవిశ్రీ ప్రసాద్‌, డివివి ఎంటర్టైన్‌మెంట్‌, వెంకీ కుడుముల, రఘు కుంచె వంటి వారు ట్వీట్లు చేశారు.