Asianet News TeluguAsianet News Telugu

మహేష్‌, రాజమౌళి మూవీ బడ్జెట్‌పై షాకింగ్‌ రూమర్‌.. ఇండియన్‌ సినిమాలోనే ఫస్ట్ టైమ్‌..? పెద్ద రిస్కే

మహేష్‌ బాబు,రాజమౌళి సినిమాకి సంబంధించిన ఓ సంచలన రూమర్స్ వినిపిస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. బడ్జెట్‌ విషయంపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.

mahesh rajamouli movie shocking budget it has not happened in indian cinema til now arj
Author
First Published Jan 2, 2024, 10:00 PM IST

మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా చేయబోతున్నారు. జక్కన్న ఇప్పుడు ఆ సినిమా కథపైనే కూర్చున్నారు. ప్రస్తుతం రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ ఈ స్టోరీని బిల్డ్ చేస్తున్నారు. రాజమౌళి కూడా దానిపై వర్క్ చేస్తున్నారని, ఓ కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. స్క్రిప్ట్ కంప్లీట్ కావడానికి మరికాస్త టైమ్‌ పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇతర వర్క్ లు కూడా జరుగుతున్నాయట. ఓ వైపు కాస్టింగ్‌, మరోవైపు టెక్నీషియన్లని వెతికే పని జరుగుతుందని తెలుస్తుంది. 

ఈ మూవీలో ఆంతర్జాతీయ టెక్నీషియన్లు కూడా పనిచేయబోతున్నారట. హాలీవుడ్‌ ఆర్టిస్ట్‌ లు, టెక్నీషియన్లు భాగం కాబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఇంటర్నేషనల్‌ స్టూడియోలు కూడా ఇన్‌వాల్వ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారట. ప్రారంభం నుంచే ఈ మూవీని ఇండియన్‌ సినిమా అనే కాకుండా ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ లాగా ప్రొజెక్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్లాన్‌ కూడా సిద్ధం చేశాడట జక్కన్న. 

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ సంచలన రూమర్స్ వినిపిస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. బడ్జెట్‌ విషయంపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. దుమారం రేపుతున్నాయి. ఇందులో దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. భారీతనం కోసం, ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కోసం ఆ రేంజ్‌ బడ్జెట్‌ అవుతుందట. కానీ రాజీపడకుండా నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా తీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఇందులో నిజం ఏంటో తెలియాలి. కానీ ఈ షాకింగ్‌ రూమర్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. 

వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఇండియాలో ఇప్పటి వరకు సినిమా రాలేదు. భారీ చిత్రాలు `బాహుబలి`, `ఆర్ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌`, `సలార్‌`, `పొన్నియిన్ సెల్వన్‌`, `కల్కి` వంటి చిత్రాలు కూడా 500కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందాయి. వాటితోపోల్చితే ఇది డబుల్‌ అని చెప్పొచ్చు. దీంతో మరి మహేష్‌ మూవీని రాజమౌళి ఎన్ని పార్ట్ లుగా తీస్తాడో చూడాలి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వేంచరస్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్‌.. సాహసికుడిగా కనిపిస్తాడని టాక్‌. `ఇండియానా జోన్స్` తరహాలో సాగుతుందని టాక్‌. ఈ ఏడాది మార్చిలో ఈ మూవీని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios