సూపర్ స్టార్ మహేష్ ని మిలియన్స్ మంది అభిమానులు ఫాలో అవుతూంటారు. ఆయన నిజ జీవితంలో ఏం చేస్తూంటారో దాన్ని అనుకరిస్తూంటారు. మహేష్ ని తమ రోల్ మోడల్ గా భావిస్తూంటారు. శ్రీమంతుడు టైమ్ లో మహేష్ బాబు బుర్రిపాలెం,సిద్దాపురం ని ఎడాప్ట్ చేసుకోగానే, ఆయన్ని అనుసరిస్తూ చాలా మంది గ్రామాలను దత్తత తీసుకున్నారు.  అలాగే మహర్షి సినిమాలో వీకెండ్ వ్యవసాయం గురించి చెప్పగానే చాలా మంది సాప్ట్ వేర్ ప్రొఫిషినల్స్  తాము కూడా అదే పంధాను అనుసరించారు. ఇలా చాలా మంది జీవితాలను ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో ఆయన ప్రేరేపిస్తున్నారు. తాజాగా ఆయన మరో విషయంలో కూడా అందరికీ భిన్నంగా నిలిచారు. మరి దాన్ని ఆయన అభిమానులు ఎంతవరకూ అనుసరిస్తారో చూడాలి. ఇంతకీ ఏమిటా విభిన్నత అంటారా...
 
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ  ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటూ  అడిగిన ఓ ప్రశ్నకు మహేష్ ఇంట్రస్టింగ్ సమాధానం ఇచ్చారు.  ``అసలు మీ ఫస్ట్ ఎస్.ఎం.ఎస్ గుర్తుందా?`` అనేది ఆ ప్రశ్న. దానికి మహేష్ ఆశ్చర్యకరమైన  ఆన్సర్ ఇచ్చారు. ``అస్సలు గుర్తు లేదు`` అనేశారు. అసలు నేను షూటింగ్ లో ఉన్నప్పుడు మా ఆవిడ ఫోన్ చేసినా .. నా మేకప్ ఆర్టిస్ట్ కానీ డ్రైవర్ కానీ ఫోన్ ఇస్తేనే నేను మాట్లాడతాను. నా దగ్గర ఫోన్ ఉండదు. అందువల్ల ఎస్.ఎం.ఎస్ ఏం తెలుస్తుంది`` అని అన్నారు.
అంటే మీకంటూ ఓ ఫోన్ లేదా? అని సుమ ప్రశ్నించారు.

 ``ఉంది కానీ.. అదెక్కడుందో తెలీదు. నేను ఫోన్ విషయంలో చాలా బ్యాడ్. పెద్దగా పట్టించుకోను`` అని మహేష్ తెలిపారు. ఒకవేళ నమ్రతతో పెళ్లి కాకపోయి ఉంటే ఫోన్ చాలా అవసరం పడేదేమో? అని సుమ అంటే.. అస్సలు వాడేవాడిని కాదేమో!! అని షాకిచ్చారు. మొత్తానికి ఈ స్మార్ట్ యుగంలో ఫోన్ వాడని ఒక స్టార్ హీరో ఉన్నారని జనాలకి అర్దమైంది. నిజంగా మనమంతా ఫోన్ ని ఎక్కువగా వాడుతున్నాం. ఇరవై నాలుగు గంటల్లో పడుకునే సమయం తప్ప ఫోన్ ని వాడుతూనే ఉన్నాము. ఇప్పటికైనా మహేష్ ని చూసి ఫోన్ వాడకం తగ్గిస్తే బాగుంటుంది ఏమంటారు. 

ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ పరుశురాంతో తన 27వ సినిమా చేయనున్నాడని తెలిసిందే. ఈచిత్రం కృష్ణ బర్త్ డే సందర్బంగా మే 31 న లాంచ్ కానుందని సమాచారం. అదే రోజు సినిమా టైటిల్ ను కూడా రివీల్ చేసే అవకాశాలు వున్నాయట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుందట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ను నిర్మించనుండగా గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు. మే 31న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.