టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా స్టార్ హీరోలందరితో చాలా సన్నిహితంగా కనిపిస్తున్నాడు. అయన త్వరలో మెగా కాంపౌండ్ లోకి ఒక సినిమా ద్వారా అడుగుపట్టబోతున్నాడు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సంస్థ మెగా హీరోలతో తప్ప వేరే హీరోలతో సినిమాలను నిర్మించరు అనే టాక్ కు కౌంటర్ ఇచ్చే విధంగా ప్రిన్స్ తో ఒక భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మహేష్ గత కొంత కాలంగా అర్జున్ రెడ్డి దర్శకుడితో క్లోజ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను గీత ఆర్ట్స్ నిర్మించడానికి సిద్దమైనట్లు సమాచారం. అల్లు అరవింద్ మహేష్ సతీమణి నమ్రత తో మహేష్ కాల్షీట్స్ గురించి మాట్లాడినట్లు సమాచారం. అయితే మహేష్ ఈ ఏడాది దొరకడం కష్టమే అని ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుత సూపర్ స్టార్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ లో 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వంశి పైడిపల్లి మహేష్ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మహేష్ అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 

ఆ తరువాత సందీప్ వంగ స్క్రిప్ట్ గురించి ఆలోచించే అవకాశం ఉన్నట్లు టాక్. అయితే ముందే కమిట్మెంట్ ఇవ్వమని అడిగితే మహేష్ కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇక నుంచి ఆయన సొంత ప్రొడక్షన్ లోనే సొంతంగా సినిమాలను నిర్మించుకోవాలని మహేష్ ఆలోచిస్తున్నాడు. కానీ ఆ లోపు గీత ఆర్ట్స్ లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.