సూపర్ స్టార్ మహేష్-మురుగదాస్ ల మూవీ టైటిల్ ఖరారు ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇవ్వనున్న చిత్ర యూనిట్ సంభవామి అనే టైటిల్ ను రిజిస్టర్ చేసిన నిర్మాత
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం టైటిల్ వేట గత కొంత కాలంగా సాగుతోంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 100 కోట్లతో తెలుగు, తమిళ భాషల్లో ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ మూవీ టైటిల్ ఖరారైందంటూ గతంలో వాస్కోడిగామా, ఎనీమీ, అభిమన్యుడు, ఏజెంట్ శివ, ఏజెంట్ 007...ఇలా రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఏజెంట్ శివ టైటిల్ దాదాపు కన్ ఫర్మ్ అయిందని.. ఈ టైటిలే త్వరలో అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని ప్రచారం జరిగింది.
అయితే.. మహేష్ బాబు – మురుగుదాస్ ల మూవీ కోసం ఫిల్మ్ ఛాంబర్ లో సంభవామి అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్ ను నూతన సంవత్సర కానుకగా జనవరి 1న, టీజర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
