మొన్నటివరకు లిమిట్ బడ్జెట్ లో సినిమా చేసిన దర్శకుడు అనిల్ రావిపూడికి ఇప్పుడు ఫుల్ ఫ్రీడమ్ దొరికేసింది. నిర్మాత అనిల్ సుంకర యంగ్ డైరెక్టర్ కి సర్వ హక్కులు ఇవ్వడంతో మహేష్ సినిమాకు దర్శకుడు అనిల్ ఎవరు ఊహించని నటీనటులను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. 

సాధారణంగా మహేష్ లెవెల్ కి తగ్గట్టు బాలీవుడ్ కోలీవుడ్ నుంచి సీనియర్ నటీనటులను తీసుకురావడం కామన్ గా మారింది. అయితే మన తెలుగులో సీనియర్ నటీనటులను కూడా సెలెక్ట్ చేసుకుంటే కొత్తగా ఉంటుందని అనిల్ బాగానే ఆలోచించాడు. అందుకే విజయశాంతిని సింగిల్ సిట్టింగ్ లో ఒప్పించాడు.  

గతంలో అవకాశాలు వచ్చినా పెద్దగా పట్టించుకోని విజయశాంతి అనిల్ కథను చెప్పగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సినిమాలో విజయశాంతి పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. మిడిల్ క్లాస్ వుమెన్ గా సమాజానికి మంచి చేసే మనస్తత్వం గల మహిళగా ఆమె కనిపిస్తుందట. ఆమెకు ప్రత్యర్థిగా సినిమాలో మరో కీలకపాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. 

వీరిద్దరి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని సమాచారం. మహేష్ కి కూడా దర్శకుడి ఐడియాలు నచ్చడంతో ఏమాత్రం అడ్డు చెప్పడం లేదట.  అతని స్టైల్ లోనే సినిమా ఉండాలని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాకు సంబందించిన స్పెషల్ ఎనౌన్స్మెంట్ ను ఇవ్వనున్నారు. ప్రస్తుతం మహేష్ మహర్షి రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.