డెబ్యూ హీరో, హీరోయిన్ మరియు డైరెక్టర్... ముగ్గురు కొత్తవాళ్ళు కలిసి చేసిన మ్యాజిక్ ఉప్పెన. ఎమోషనల్ ప్రేమ కథగా తెరకెక్కిన ఉప్పెన చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై రెండు వారాలు కావస్తున్నా, ఉప్పెన థియేటర్స్ వద్ద ప్రేక్షకుల సందడి తగ్గలేదు. ఇక ఉప్పెన చిత్రాన్ని అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసించగా... ఈ లిస్ట్ లో మహేష్ కూడా చేరారు. ఉప్పెన మూవీ గురించి సోషల్ మీడియాలో మహేష్ చాలా ఎగ్జైటింగ్ గా స్పందించారు. హీరో హీరోయిన్స్, దర్శకుడు మరియు నిర్మాతలను ఆకాశాన్ని ఎత్తివేశాడు. 


ఒక్క మాటలతో చెప్పాలంటే ఉప్పెన ఓ క్లాసిక్. దర్శకుడు బుచ్చి బాబును చూస్తుంటే గర్వంగా ఉంది. నీవు కాలాలకు అతీతమైన చిత్రం తీశావు... అని ట్వీట్ చేశారు. 


ఇక సెకండ్ ట్వీట్ లో హీరో వైష్ణవ్, హీరోయిన్ కృతి శెట్టిలను పొగిడారు. ఇద్దరు కొత్తవాళ్లు ఇలాంటి అద్భుత నటన కనబర్చడం హృదయ పూర్వకంగా ఆనందం వేసింది. మీరిద్దరూ స్టార్స్... అన్నారు మహేష్.


 
అలాగే ఇలాంటి క్లాసిక్ చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతలు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాడు మహేష్ బాబు. మహేష్ లాంటి స్టార్ ఉప్పెన చిత్రం గురించి ఈ స్థాయిలో పొగడ్తల జల్లు కురిపించడం గొప్ప విషయమే అని చెప్పాలి. ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట నిర్మాతలలో ఒకరిగా మైత్రి మూవీ మేకర్స్ ఉన్న విషయం తెలిసిందే.