ఉగాది పండుగరోజు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ నూతన చిత్రాలపై లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇక సూపర్ స్టార్ మహేష్ సైతం ఒక ఆసక్తికర అప్డేట్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఆయన తాజా చిత్రం సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ నేడు మొదలు కానుంది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ... అన్నీ భద్రతా నియమాలు పాటిస్తూ సర్కారు వారి పాట షూటింగ్ జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు.

 
ఇక సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో చిత్రీకరించారు. కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్ కాంబినేషన్ సన్నివేశాలు అక్కడ షూట్ చేయడం జరిగింది. కాగా సెకండ్ షెడ్యూల్ కి కొంచెం గ్యాప్ రాగా, నేటి నుండి ప్రారంభం అవుతున్నట్లు అధికారిక సమాచారం అందించారు. 


దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట చిత్రాన్ని జనవరి 2022లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఆర్థిక నేరాలు అనే సబ్జెక్టుతో సరికొత్తగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.