బాలీవుడ్ హీరోయిన్ అమృత రావ్ శనివారం నాడు పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చారు. ఈ విషయాన్ని అమృత రావ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అబ్బాయి పుట్టాడని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారన్న పోస్ట్ ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో దర్శనం ఇచ్చింది. అమృత భర్త అన్మోల్ మరియు అమృతరావ్ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. 

అదే సమయంలో తమ కుమారుడికి మంచి పేరు సజెస్ట్ చేయాలని వారు అభిమానులను రిక్వెస్ట్ చేశారు. ఇక నెటిజెన్స్ వారి విజ్ఞప్తికి స్పందించడంతో పాటు తమకు నచ్చిన పేరులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఎక్కవ మంది అమృతా రావ్ లో మొదటి రెండు అక్షరాలు, అన్మోల్ పేరులో మొదటి రెండు అక్షరాలు కలిపి అమన్ అని పెట్టాలని కోరుకుంటున్నారు. అభిమానులు ఆసక్తితో ఇచ్చిన సలహాలను ఈ కపుల్ ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారో చూడాలి. 

బాలీవుడ్ హీరోయిన్ గా పలు హిట్ చిత్రాలలో నటించిన అమృతా రావ్ తెలుగులో కేవలం ఒకే ఒక చిత్రంలో నటించింది. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన అతిథి సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా తరువాత అతిథి టాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు. అమృత రావ్ రేడియో జాకీ అయిన అన్మోల్ ని 2016లో వివాహం చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు ఈ జంట ప్రేమించుకోవడం జరిగింది. 2013 నుండే సినిమాలకు గుడ్ బై చెప్పిన అమృతా రావ్ 2019లో కమ్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AMRITA RAO🇮🇳 (@amrita_rao_insta) on Nov 2, 2020 at 4:05am PST