ఏదో ఒక వివాదం లేకపోతే ప్రశాంతంగా ఉండేటట్లు కనపడటం లేదు నేటి తరం దర్శకులు. తమ సినిమాలో వివాదం లేకపోతే తన మాటల ద్వారా అయినా వివాదం క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఫలక్ నుమా దాస్ దర్శకుడు విశ్వక్ సేన్ అదే పనిచేసాడు. తన వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సినిమాకు హైప్ తెచ్చే పోగ్రాం పెట్టుకున్నాడు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కోపం తెప్పించి మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఇదిగో ఇప్పుడు కల్కి దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్టర్ వివాదం రాజేస్తోంది. 

రీసెంట్ గా రాజశేఖర్ పోలీస్ యూనిఫామ్ లో ఓ నాగలని భుజాన వేసుకున్న పోస్టర్ ని ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసారు. అది అలా వదిలేస్తే ఫరవాలేదు. దానికి ఓ ఎమోజి కలిపి...కమర్షియల్ సినిమాల్లో నాగలి ని హీరో పట్టడం అనేది కామన్ అయ్యిపోయింది అన్న విధంగా వ్యాఖ్యానించారు.  

అయితే ప్రశాంత్ వర్మ సరదాగా చేసినట్లున్న ఈ వ్యాఖ్యని మహేష్ ఫ్యాన్స్ సీరియస్ గానే తీసుకున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా పోస్టర్స్ పై నాగలి పట్టుకుని ఉన్న మహేష్ ఉంటారు. దాన్ని వెటకారం చేస్తున్నాడనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ వర్మని ట్రోల్ చేయటం మొదలెట్టారు. ఇక కల్కి చిత్రం ఈ రోజు రిలీజ్ అవుతోంది.