సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార అల్లరి పిడుగు అనిచెప్పాలి. పదేళ్లు కూడా నిండని ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. నాన్న మహేష్ పాటలకు డాన్స్ చేస్తూ వీడియోలు పంచుకొనే సితార, తరచుగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్లు పెడుతూ ఉంటుంది. సితార సోషల్ మీడియా పోస్ట్స్ ఫాలో అయ్యేవారు చాలా మందే ఉన్నారు. అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ కలిగిన సీతారను మూడు లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు. 


తండ్రి తరువాత ఆ కుటుంబం నుండి ఆ రేంజ్ క్రేజ్ సంపాదించుకొనే పనిలో సితార ఉన్నారు.తాజాగా అన్న గౌతమ్ ఘట్టమనేనితో స్విమ్ చేస్తూ దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది సితార. తమ ఇంటిలో గల పూల్ లో బ్రదర్ అండ్ సిస్టర్ సరదాగా స్విమ్ చేస్తున్నట్లు ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. అలాగే వీరిద్దరూ అప్పుడే స్విమ్మింగ్ లో ఎక్స్పర్ట్స్ అనిపిస్తుంది. 


మహేష్ వారసుడిగా గౌతమ్ కొన్నేళ్లలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే గౌతమ్ మహేష్ నటించిన వన్ నేనొక్కడినే మూవీలో చిన్నప్పటి మహేష్ గా కనిపించారు. అయితే సితారతో పోల్చితే, గౌతమ్ చాలా నెమ్మదస్తుడు అనిపిస్తుంది. సితార మాదిరి సోషల్ మీడియాలో గౌతమ్ సందడి చేయదు. ఇక మహేష్ చిన్న ప్రాయంలోనే స్టార్ చైల్డ్ గా అనేక సినిమాలు చేశారు. మహేష్ తక్కువ ప్రాయంలోనే అన్న రమేష్, తండ్రి కృష్ణలతో మల్టీస్టారర్స్ చేశాడు. దీనితో గౌతమ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.