భరత్ అనే నేను - మహర్షి సినిమాలతో మెప్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ ను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి హాలిడేస్ ట్రిప్స్ కూడా గట్టిగానే వేస్తున్నాడు. ఇక జూన్ లో మహేష్ తన తదుపరి సినిమా పనులను వేగవంతం చేయనున్నాడు. 

ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి టైటిల్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకు రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్ ని అనుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమాలో మహేష్ కాస్త భయంతో కనిపిస్తాడట. ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన పాత్రలోకనిపించే  మహేష్ రక్తాన్ని చూసి ఎక్కువగా బయపడిపోతాడట. 

రాయలసీమ ప్రాంతంలో మహేష్ పోలీస్ గా కూడా కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్. రక్తాన్ని చూసి భయపడే మహేష్ అక్కడి పరిస్థితులను ఎలా ఫెస్ చేశాడు అనేది సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చెయ్యాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ కి నిర్మాత.