`పోకిరి`..టాలీవుడ్‌ రికార్డులను తిరగరాసిన చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమకి కలెక్షన్ల రుచిని చూపించిన చిత్రం. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌. హీరో అంటే ఇలానే ఉండాలనే మోనోటనీని బ్రేక్‌ చేసిన చిత్రం. నాలుగు భాషల్లో రీమేక్‌ అయి అన్నింటిలోనూ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిత్రం. టోటల్‌గా బాక్సాఫీస్‌ కా బాప్‌ అనిపించిన చిత్రం. మహేష్‌ బాబు, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమిది. పూరీ టేకింగ్‌, మహేష్‌ యాక్షన్‌ సినిమాని సూపర్‌ హిట్‌ని చేశాయి. కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇది 42కోట్లు షేర్‌ని, 66కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది.

తాజాగా ఇది 15ఏళ్లు పూర్తి చేసుకుంది. 2006 ఏప్రిల్‌ 28న ఈ సినిమా విడుదలైంది. ఇందులో ఇలియానా అందాలు స్సెషల్‌ ఎట్రాక్షన్‌. ఆమె అమాయకమైన నటన హైలైట్‌. పాటలు సైతం సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. మణిశర్మ అద్భుతమైన పాటలను అందించారు. అప్పటి వరకు కిరాయి రౌడీగా ఉన్న హీరో క్లైమాక్స్ లో తండ్రిని విలన్లు చంపేయడంతో ఒక్కసారిగా ఐపీఎస్‌ ఆఫీసర్‌గా మారే ట్విస్ట్ సినిమాకి హైలైట్‌. అసలు ఓ సినిమాలో అత్యంత మిస్టీరియస్‌గా ఉన్న ట్విస్ట్ ఇదే. సినిమా బాక్సాఫీసుని షేక్‌ చేయడంలో కీలక పాత్ర ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ప్రధాన కారణం.

ఈ సినిమాని మహేష్‌ సోదరి మంజులా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కలిసి నిర్మించడం విశేషం. తాజాగా ఈ సినిమా 15ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అటు మహేష్‌, ఇటు పూరీ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్సెషల్‌ పోస్టర్లని పంచుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్‌ అయి సక్సెస్‌ సాధించింది.