Asianet News TeluguAsianet News Telugu

కంగనాపైకి చెప్పు విసిరిన సీనియర్ డైరక్టర్!

తను అనుకున్నది చెప్పాల్సిందే. తన మాట చెల్లాల్సిందే. అందుకు ఆమె చెల్లిలు కూడా ఆద్యం  పోస్తూంటుంది. తాజాగా కంగనా పై బాలీవుడ్  సీనియర్ డైరక్టర్ చెప్పు విసిరారనే విషయం రంగోలి రివీల్ చేసింది.

Mahesh Bhatt threw 'chappal' at Kangana Ranaut as claimed by actress' sister Rangoli
Author
Mumbai, First Published Aug 5, 2021, 8:59 AM IST

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్ అనేది అందరూ ఒప్పుకునేదే. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎవరి ఒకర్ని టార్గెట్ చేయకుండా ఈ అందగత్తె నిద్రపోదు. చివరకు సోషల్ మీడియా అకౌంట్ లు బ్యాన్ చేసిన కంగనా తన రూట్ మాత్రం మార్చ లేదు. తను అనుకున్నది చెప్పాల్సిందే. తన మాట చెల్లాల్సిందే. అందుకు ఆమె చెల్లిలు కూడా ఆద్యం  పోస్తూంటుంది. తాజాగా కంగనా పై బాలీవుడ్  సీనియర్ డైరక్టర్ చెప్పు విసిరారనే విషయం రంగోలి రివీల్ చేసింది.

కంగనా వివాదాల్లో మహేశ్ భట్, ఆలియా భట్ పై ఆమె చేసిన ఆరోపణలు ఒకెత్తు. గతంలో మహేశ్ భట్ ‘వో లమ్హే’ సినిమాలో మంచి పాత్రని చేసింది కంగనా. ఆ సినిమా ఆమె కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది కూడా. అయినా కానీ, దేనిగొడవ దానిదే అన్నట్లు కంగనా రెచ్చిపోతూంటుంది. కంగనా ఏనాడూ మహేశ్ ని, ఆలియాని వదిలిపెట్టలేదు.అవకాసం దొరికితే చాలు వాళ్లు పై ఓ రేంజిలో రెచ్చిపోతుంది. ఆమెతో బాటూ ఆమె సోదరి రంగోలీ ఛండేల్ కూడా భట్ ఫ్యామిలీని సొషల్ మీడియాలో చాలా రోజులు టార్గెట్ చేస్తూ వస్తోంది.

ఇక కంగనా, రంగోలి మాటలతో హర్టైన ఆలియా తల్లి సోనీ రాజ్దాన్ 2006లో ఓ ట్వీట్ చేసింది. మహేశ్ భట్ తనకి బ్రేక్ ఇచ్చినా కూడా కంగనా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తోందని ఆమె ఆట్వీట్ లో రాసింది. అంతే కాదు, మహేశ్ భట్ తో పాటూ ఆయన భార్యని, కూతుర్ని కూడా కంగనా టార్గెట్ చేస్తోందంటూ సోనీ రాజ్దాన్ ఆరోపించింది. కానీ, కంగనా తరుఫున రంగోలీ గట్టిగా రిప్లై ఇచ్చింది.

ఆ రిప్లైలో ..‘వో లమ్హే’ సినిమా డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ మహేశ్ భట్ కాదనీ చెప్పుకొచ్చింది రంగోలి. కాబట్టి సినిమాలో ఆఫర్ ఆయన ఇచ్చినట్లు కాదని, బ్రేక్ ఇచ్చినట్టు కూడా కాదని ఆమె స్పష్టం చేసింది. ఇక కంగనాకు అసలు మొదటి చిత్రం అందించింది అనురాగ్ బసు అంటూ గుర్తు చేసింది కంగనా సోదరి. విషయాన్ని మరింతగా లాగిన రంగోలి… ‘వో లమ్హే’ తరువాత కంగనా మహేశ్ భట్ తో పనిచేయనుందని చెప్పింది. అందుకు కోపగించిన భట్ ఆమె ప్రీమియర్ షోకి వస్తే చెప్పు విసిరేసి దుర్భాషలాడాడని పేర్కొంది. స్పెషల్ షో చూడనీయకుండానే కంగనాని మహేశ్ భట్ తిప్పి పంపాడని...చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడీ చెప్పుల టాపిక్ ఎందుకో ఎవరికీ అర్దం కాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios